గెస్ట్‌గా కిచ్చా సుదీప్ ఎంట్రీ.. ఈ వారం అంతా సేఫ్..
Send us your feedback to audioarticles@vaarta.com
‘సోగ్గాడే చిన్ని నాయనా’ టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. హోస్ట్ నాగార్జున సాంగ్స్ మెడ్లీతో కంటెస్టెంట్‌లంతా ఇరగదీశారు. సండే ఫన్ డేలో భాగంగా.. మొన్న జంటలుగా వెళ్లిన కంటెస్టెంట్‌లంతా సోలోగా వెళ్లి నాగ్ చెప్పినవి తీసుకురావాలి. మొదట అరియానాను పంపిస్తే నేను చేయలేనని భయపడుతూ ఆగిపోయింది. కంటెస్టెంట్‌లంతా ధైర్యం చెప్పేసరికి ఎలాగోలా వెళ్లి ట్రై చేసింది. కానీ బాగా భయపడుతుండటంతో నాగ్ వెనక్కు పిలిచారు. నెక్ట్స్ సొహైల్‌ని పంపిస్తే నాకు మస్తు ధైర్యం ఈసారి కథ వేరుంటదని చెప్పి వెళ్లాడు. గజ్జెల శబ్ధం వినిపించగాన సొహైల్ భయపడటం ఫన్నీగా అనిపించింది. నెక్ట్స్ హారిక వెళ్లింది. ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా వస్తువులను ఐడెంటిఫై చేసి బయటకు వచ్చింది. నెక్ట్స్ వెళ్లిన అఖిల్.. భయపడిన తీరు బాగా నవ్వు తెప్పించింది. బయటకు వచ్చిన తర్వాత భయపడ్డావా? అని అఖిల్‌ని అడిగితే భయపడలేదన్నాడు. వీడియో చూపించనా అని అడిగితే వద్దు సార్.. ఇజ్జత్ పోతది అని వేడుకోవడం మరింత ఫన్నీగా అనిపించింది. నెక్ట్స్ వెళ్లిన మోనాల్ కూడా ఏమాత్రం కూడా భయపడకుండా వెళ్లి వచ్చేసింది. తరువాత వెళ్లిన అభి కూడా భయపడకుండానే వచ్చేశాడు. నెక్ట్స్ అవినాష్‌ని నాగ్ ఓ రేంజ్‌లో ఆడుకోవడం చాలా ఫన్నీగా అనిపించింది. ఆ తరువాత మొన్న అఖిల్, సొహైల్ కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లి చేసిన రచ్చను చూపించి అందరినీ బాగా నవ్వించారు.
ఇక ఫైనల్‌గా అరియానాను మరోసారి వెళతావా? అని అడిగారు. ఈసారి అరియానా వెళ్లి.. టాస్క్ ముగించింది. తరువాత కిచ్చా సుదీప్ ఎంట్రీ ఇచ్చారు. కన్నడలో ఏడు సీజన్లకు సుదీప్ హోస్ట్‌గా చేశారు. కొన్ని ఆసక్తికర అంశాలను నాగ్‌తో పంచుకున్న అనంతరం నాగ్‌ని కాసేపు పక్కకు పంపించి సుదీప్ కంటెస్టెంట్ల ముందుకు వెళ్లారు. నా తెలుగు చాలా బాగుంటుంది. మీరు అర్థం చేసుకోవాలని చెప్పారు. నాగ్ కావాలంటే ఆయన ఎందుకు రావాలో కారణాలు చెప్పాలన్నారు. హారిక.. మేము ఆయన్ను చాలా ఇష్టపడతామని చెప్పారు. అప్పుడు.. సుదీప్ ఆయన ఫ్యామిలీ కూడా ఆయనను చాలా ఇష్టపడుతుందని చెప్పారు. ఆ తరువాత అంతా తమ రీజన్స్‌ను చెప్పారు. తరువాత నాగ్‌ను సుదీప్ పిలిచారు. సుదీప్ నేను మీతో కన్నడలో మాట్లాడతానని చెప్పడంతో సొహైల్ ఒక్క మాట మాట్లాడాడు. ఆ ఒక్కమాట తప్ప మరో మాట రాదని చెప్పడం ఫన్నీగా అనిపించింది. తర్వాత సుదీప్.. అవినాష్‌ని నువ్వు హౌస్‌లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరిని మ్యారేజ్, డేట్, చంపేస్తావని అడిగారు. మోనాల్‌తో డేట్ చేస్తానని.. హారికను మ్యారేజ్ చేసుకుంటానని.. అరియానాను చంపేస్తానని చెప్పాడు.
హారికను నీకు బాగా ఇంపార్టెంట్ ఏది అని అడిగారు? నీకు లాయల్టీ, విన్నింగ్‌లలో ఏది ఇష్టమని అడిగారు. లాయల్టీ ఇంపార్టెంట్ అని చెప్పింది. తర్వాత అభిని.. నువ్వు హారిక లాంగ్ హెయిర్‌ని ఇష్టపడతావా? షార్ట్ హెయిర్‌ని ఇష్టపడతావా? అని అడిగితే షార్ట్ హెయిర్ అని చెప్పాడు. అరియానాను.. నువ్వు అవినాష్ అయితే పొద్దుటే లేవగానే ఏం చేస్తావని అడిగితే.. ఆ రోజు నేనసలే నిద్ర లేవనని చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది. సొహైల్‌ని నీకు మటన్, చికెన్‌లలో నీకు ఏది ఇష్టమంటే.. మటన్ అని చెప్పాడు. అఖిల్ అని పిలిచి వెంటనే మోనాల్ అనడం ఫన్నీగా అనిపించింది. ఇక నాగ్.. వాళ్లిద్దరూ ఒకటేనని చెప్పారు. నీకు సూపర్ పవర్ ఉంటే నువ్వు ఎవరిని మాయం చేస్తావని అడిగితే మోనాల్ అని చెప్పారు. నాకు కొన్ని సార్లు టార్చర్ తెప్పిస్తుందని చెప్పారు. ఇక మోనాల్‌ను.. నీ గురించి ఒక పుకారు మొదలు పెట్టాలంటే ఏం రూమర్‌ను స్ప్రెడ్ చేస్తావని అడిగారు. నేనస్సలు ఏడవను చాలా స్ట్రాంగ్ అని చెప్పింది. అది నిజంగా రూమరేనని నాగ్ చెప్పారు. సుదీప్‌కి నువ్వు నాకు చాలా ఇష్టం అని మోనాల్ చెబితే.. అది చాలా జెన్యూన్ ఆన్సర్‌లా అనిపిస్తోందని సుదీప్ చెప్పి నవ్వించారు. తరువాత సుదీప్.. అఖిల్‌ను సేఫ్ చేశారు.
తను మొదట చూసిన తెలుగు సినిమా ‘గీతాంజలి’ అని సుదీప్ చెప్పారు. సెకండ్ తెలుగు సినిమా ‘శివ’ అని చెప్పారు. తరువాత సుదీప్ వెళ్లిపోయారు. ఇక నామినేషన్స్‌లో అరియానా, అవినాష్ మిగిలారు. వారిద్దరినీ నిలబెట్టి అవినాష్‌ని ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ని నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉంటే వచ్చే వారం.. లేదంటే ఈ వారం.. మూడో అవకాశం.. నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉంటే అరియానా కోసం వాడాలని చెప్పారు. డిసైడ్ చేసుకోమని నాగ్ సైడ్ అయ్యారు. అవినాష్.. నేను ఎలిమినేట్ అవుతానని అనిపిస్తోందని ఈ కార్డు నేనే వాడుకుంటానని చెప్పాడు. అరియానా కూడా ఓకే చెప్పింది. హౌస్‌మేట్స్ కూడా వాడుకోవడం బెటర్ అని చెప్పారు. అవినాష్.. ఈ వారమే నాకోసమే ఉపయోగించుకుంటానని అవినాష్ చెప్పాడు. అయితే ఎవిక్షన్ పాస్ వాడి అవినాష్ సేఫ్ అయ్యాడు. అరియానా సహజంగానే సేఫ్ అయ్యింది. అయితే హౌస్‌మేట్స్ సపోర్ట్ తనకున్నా.. బయట ప్రేక్షకుల సపోర్ట్ తనకు లేదని అవినాష్ చెప్పాడు. నాగ్ అతనికి మంచి బూస్ట్ ఇచ్చారు. సెల్ఫ్ సింపతీలోకి వెళ్లొద్దని చెప్పారు. ఇక రేపటి నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ చేతుల్లోనే పెట్టినట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments