జనసేనానిని కలిసిన సుదీప్.. ఆసక్తికర విషయం ఏంటంటే..

  • IndiaGlitz, [Tuesday,October 06 2020]

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గారితో ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ కార్యాలయానికి సుదీప్ వెళ్లారు. ఈ సందర్భంగా పవన్‌కు సుదీప్ ఓ మొక్కను బహూకరించారు. వారిద్దరి మధ్య సుమారు గంట సేపు సంభాషణ సాగింది. కోవిడ్ అన్ లాక్ నేపథ్యంలో ఇటీవలే సినిమా చిత్రీకరణలు మొదలయ్యాయి... ఈ క్రమంలో తాను నటిస్తున్న చిత్రాల గురించి పవన్‌కు సుదీప్ వివరించారు.

కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్స్ చేయడంపై వారిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. వర్తమాన, సామాజిక అంశాలపై ఆలోచనలను పంచుకున్నారు. అయితే ఆసక్తికర అంశం ఏమిటంటే... ఇద్దరి జన్మదినం సెప్టెంబర్ 2వ తేదీ కావడం. ‘ఈగ’ సినిమాతో టాలీవుడ్‌లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న సుదీప్ ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. క్రిష్ డైరెక్ష‌న్‌లో పీరియాడిక్ డ్రామా నేప‌థ్యంలో తెరకెక్కనున్న సినిమాతోపాటు మ‌రో సినిమాకు కూడా ఓకే చెప్పారు.

More News

వైద్యుల మాట వినకుండానే ట్రంప్ డిశ్చార్జ్ అయ్యారట..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చికిత్స పొందుతున్న వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

థియేటర్స్ కు కేంద్ర ప్రభుత్వం సూచించిన నిబంధనలు...

కోవిడ్‌ ప్రభావంతో సినిమా రంగం కుదేలైంది. ఆరు నెలలు థియేటర్స్‌ మూతపడ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి.

పుకార్లకు క్లారిటీతో చెక్‌ పెట్టిన శృతిహాసన్‌

రీసెంట్‌గా శ్రుతి హాసన్‌ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. దాని తర్వాత శ్రుతి హాసన్‌ దక్షిణాది సినిమాలను తక్కువగా మాట్లాడిందంటూ వార్తలు వినిపించాయి.

పెళ్లి తేదీ చెప్పేసిన కాజల్ అగర్వాల్

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ముంబైకి చెందిన బిజినెస్‌మేన్‌ గౌతమ్‌ కిచ్లుని పెళ్లి చేసుకోనుందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

తారక్‌ ఫ్యాన్స్‌కి 'ఆర్‌ఆర్‌ఆర్‌' ట్రీట్‌ రెడీ

దర్శకుధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)‌’.