చ‌ర‌ణ్ చిత్రంలో సుదీప్‌?

  • IndiaGlitz, [Sunday,April 29 2018]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యాక్షన్ చిత్రాల‌ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో తమిళ హీరో ప్రశాంత్‌తో పాటు ఆర్యన్ రాజేష్, స్నేహ, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ప్రతినాయక పాత్రలో వివేక్ ఒబెరాయ్ క‌నిపించ‌నున్నారు.భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో మరో స్టార్ నటుడు కూడా నటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఆ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ రోల్ కోసం కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్‌ను సంప్రదించిందంట‌ చిత్ర బృందం. పాత్ర నచ్చడంతో  సుదీప్ కూడా వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తోంది. ‘ఈగ’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుదీప్ ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను అలరిస్తారని చెబుతున్నారు.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా'లో కూడా సుదీప్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి.. సుదీప్‌ ఏక‌కాలంలో తండ్రీ కొడుకుల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం ద‌క్కించుకున్నాడ‌న్న‌మాట‌.

More News

'యాత్ర'లో 'బాహుబలి 2' యాక్ట్ర‌స్‌

సమైక్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌గా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'యముడికి మొగుడు'కి 30 ఏళ్ళు

ధర్మాన్ని పాటించే యమధర్మరాజు తప్పు చేస్తే ఎలా ఉంటుంది అన్న కథాంశంతో తెరకెక్కిన చిత్రమే 'యముడికి మొగుడు'.

ర‌వితేజ హీరోయిన్ వైపే మొగ్గు చూపుతున్న రామ్‌

ఎన‌ర్జిటిక్‌ స్టార్ రామ్ హీరోగా పి.ఎస్‌.వి. గ‌రుడ‌వేగ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే.

వెంకీతో కామెడీ చేయ‌నున్న అన‌సూయ‌

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకులుగా  'ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' పేరుతో ఓ మల్టీస్టారర్ మూవీ  తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో సుమంత్‌

గత ఏడాది విడుద‌లైన‌ 'మళ్ళీ రావా' చిత్రం విజయంతో మ‌రోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కేసారు హీరో సుమంత్. ఆ చిత్రంలో కార్తీక్‌గా సుమంత్ నటన పలువురి ప్రశంసలు అందుకుంది.