గర్వంగా ఫీలవుతున్న సుదీప్...
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ స్టార్ హీరో సుదీప్.. చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న `సైరా నరసింహారెడ్డి`లో అవుకు రాజు పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం జార్జియాలో చిత్రీకరణను జరుపుకుంటుంది. యాక్షన్ ఏపిసోడ్స్ చిత్రీకరణతో సుదీప్ రోల్ సైరాకు సంబంధించి పూర్తయ్యిందట.
ఈ విషయాన్ని సుదీప్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. `లెజెండ్ చిరంజీవిగారి ఆతిథ్యం మరచిపోలేను. హిస్టారికల్ చిత్రంలో చిరంజీవిగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది... గౌరవంగా భావిస్తున్నాను. సురేందర్ రెడ్డి, ప్రాజెక్ట్‌కి మూల స్తంభంగా నిలిచిన రామ్‌చరణ్ అండ్ టీమ్‌కు అభినందనలు`` అంటూ చిరంజీవితో ఉన్న ఫోటోను షేర్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments