ఏపీలో సడెన్‌గా పెరిగిన కరోనా కేసులు.. కారణం ఇదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. టెస్టుల మొదలు.. ట్రేసింగ్.. ట్రీట్మెంట్ అంతా పర్ఫెక్ట్గా జరుగుతోంది. ప్రతిపక్షాలకు సైతం ఎక్కడా వేలెత్తి చూపేందుకు లేకుండా కరోనాపై ప్రభుత్వం పోరును సాగిస్తోంది. కరోనా బాధితులకు హాస్పిటళ్లు సరిపోకుంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. తగ్గడం మాట అటుంచితే గత రెండు రోజులుగా కరోనా మృతుల సంఖ్య భారీగా పెరిగి పోయి సామాన్య ప్రజానీకాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది.
రెండు రోజుల్లోనే 80 మంది మృతి..
ఏపీలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకూ 2000లకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. గత రెండు రోజుల్లో 80 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తంగా 408కి చేరుకుంది. నిన్న ఏపీలో కొత్తగా 1916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 33 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులున్నాయి. జిల్లాల్లో సైతం రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అధికారులు సైతం కరోనా కట్టడిని మరింత సీరియస్‌గా తీసుకుని పని చేస్తున్నారు. తిరుపతి, పశ్చిమ గోదావరి, కర్నూలు, గుంటూరు తదితర కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు.
అయినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
తిరుపతిలోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్.. ఆ జిల్లా ప్రజలకు ‘ఒకేఒక్కడు’ సినిమాని గుర్తు చేస్తున్నారు. ఒంగోలులో ఆయన వర్తకులతో తాజాగా ఓ రివ్యూ మీటింగ్‌ను నిర్వహించి.. కరోనా కట్టడిలో తనకంటే మంచిగా పనిచేసే వ్యక్తి ఉంటే ఒక రోజు కలెక్టర్‌గా పనిచేసే అవకాశం కల్పిస్తానని పిలుపునిచ్చారు. మరోవైపు జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య పెంచుతున్నారు. అయినా కరోనా కేసులు పెరుగుతున్నాయంటే.. ప్రజల నిర్లక్ష్యం కూడా ఓ కారణమని పలువురు పేర్కొంటున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని చెబుతున్నా.. లాక్డౌన్ సడలింపుల అనంతరం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. భౌతికదూరం కూడా పాటించడం లేదు. కొందరి నిర్లక్ష్యం ప్రజలందరికీ ఇబ్బందికరంగా మారుతోంది. మరోవైపు టెస్టుల సంఖ్యను కూడా భారీగా పెంచడంతో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments