స్వీట్ షాక్ : క్రేజీ డైరెక్టర్ తో హీరోయిన్ పెళ్లి.. అంతా సడెన్ గా..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ యామి గౌతమ్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చింది. క్రేజీ డైరెక్టర్ తో ఆమె పెళ్లి గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. వివాహం పూర్తయ్యాక యామి గౌతమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.
ఇదీ చదవండి: నన్ను దూరం పెడుతున్నావా అని బాలుగారు కోపంగా అన్నారు : చిరంజీవి
ఇంతకీ యామి గౌతమ్ పెళ్లి చేసుకుంది ఎవరినో తెలుసా ? 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో దేశం దృష్టిని ఆకర్షించిన దర్శకుడు ఆదిత్య ధార్ ని. ఈ సందర్భంగా ఆదిత్యతో కలసి పెళ్లి దుస్తుల్లో సాంప్రదాయ బద్దంగా ఉన్న అందమైన ఫోటోని యామి గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో కేవలం సన్నిహితుల సమక్షంలోనే ప్రైవేట్ గా మా వివాహం జరిగింది. మా ప్రేమ ప్రయాణం మొదలయింది.. మీ అందరి ఆశీర్వాదం కావాలి' అని యామి గౌతమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా యామి, ఆదిత్యల వివాహం జరిగింది.
ఉరి చిత్రంతో ఆదిత్య ధార్ ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2016లో ఇండియా పాక్ ఉగ్ర స్థావరాలపై చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా ఉరి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో యామి గౌతమ్ కూడా కీలక పాత్రలో నటించింది.
ఆ సమయంలోనే మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇలా పెళ్లి చేసుకుని అందమైన జీవితాన్ని ప్రారంభించారు. యామి గౌతమ్ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించింది. గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి చిత్రాల్లో యామి మెరిసిన సంగతి తెలిసిందే. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ యామి గౌతమ్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments