'బిచ్చగాడు' సక్సెస్ మీట్
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా నటించిన తమిళ చిత్రం 'పిచ్చైకారన్'. శశి దర్శకుడు. ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి 'బిచ్చగాడు' టైటిల్ తో తెలుగులో అనువదించారు. ఇటీవల విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా.. చిత్రబృందం మంగళవారం హైదరాబాద్ లోని సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు బిచ్చగాడు అనే టైటిల్ పెట్టినప్పుడు నెగెటివ్ ఇంపాక్ట్ వస్తుందని అందరూ అన్నారు. కాని ఈ సినిమాకు టైటిల్ పెద్ద ప్లస్ అయింది. తమిళంలో ఈ సినిమాను ఎంతగా ఆదరించారో.. దానికి మించి తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రోజు రోజుకి థియేటర్ల సంఖ్య పెరుగుతుంది. స్క్రిప్ట్ ను నమ్మి తెలుగులో రిలీజ్ చేసిన చదలవాడ శ్రీనివాస్ గారికి థాంక్స్. నేను తదుపరి చేయబోయే సినిమాల చిత్రీకరణ యాబై శాతం రెండు తెలుగు రాష్ట్రాలలోనే చేయాలని భావిస్తున్నాను' అని చెప్పారు.
శశి మాట్లాడుతూ..'హ్యూమన్ ఎమోషన్స్ ను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమా చేశాను. తమిళం, తెలుగుకు ఈ సినిమా సూట్ అవుతుందా.. అని ఆలోచించలేదు. కథను నమ్మి తీశాను. తెలుగులో పెద్ద మాసివ్ హిట్ గా నిలిచింది' అని చెప్పారు.
చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'ముప్పై సంవత్సరాల తరువాత ఓ మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించామని ఆనందంగా ఉంది. తమిళం కంటే ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో రేపటినుండి థియేటర్స్ సంఖ్యను పెంచబోతున్నాం' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, సాత్న, భాష శ్రీ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments