శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సుబ్రహ్మణ్యపురం'
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల మళ్ళీరావా చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈషా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ సుమంత్ కెరీర్‌లో 25వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఈ చిత్రంలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది.
ఈ నెల 8వ తేదీ నుంచి హైదరాబాద్‌లో హీరో, హీరోయిన్ ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తయింది. తప్పకుండా ఈ చిత్రం సుమంత్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.
ఈ చిత్రంలో సుబ్రహ్మాణ్యం స్వామిపై వున్న ఓ అద్భుతమైన పాటకు ప్రముఖ పాటల రచయిత జోన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించగా, ఆ సాహిత్యాన్ని మెచ్చిన లెజెండరీ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం ఆ పాటకు గాత్రాన్ని అందించడాని అంగీకరించడం మా అదృష్టంగా భావిస్తున్నామని ఆ పాట చిత్రానికి హైలైట్‌గా నిలవబోతుందని భావిస్తున్నామని నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ అనుగ్రహించే దేవుడే ఆగ్రహిస్తే ఆ భక్తుల పరిస్థితి ఏమిటి అనే నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో సుమంత్ నాస్తికుడిగా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా కనిపిస్తారు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందని నమ్మకం వుంది అని తెలిపారు.
సుమంత్, ఇషారెబ్బ,తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, జోష్ రవి, భద్రమ్ గిరి, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కళా దర్శకత్వం: లక్ష్మీసింధూజ గ్రంధి, ప్రాజెక్ట్ డిజైనర్: కృష్ణ చిత్తనూర్, ైస్టెలింగ్: సుష్మ త్రిపురాన, ప్రొడక్షన్ కంట్రోలర్:సలాన బాలగోపాలరావు, మూలకథ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రచనా సహకారం: నాగమురళీధర్ నామాల, నిర్మాత: బీరం సుధాకర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments