శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'సుబ్రహ్మణ్యపురం'

  • IndiaGlitz, [Wednesday,August 08 2018]

ఇటీవల మళ్ళీరావా చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సుబ్రహ్మణ్యపురం. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రవైట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈషా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ సుమంత్ కెరీర్‌లో 25వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రమిది. సూపర్ నాచురల్ అంశాల మేళవింపుతో సాగే మిస్టరీ థ్రిల్లర్ ఈ చిత్రంలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ ప్రేక్షకులకు కలిగిస్తుంది.

ఈ నెల 8వ తేదీ నుంచి హైదరాబాద్‌లో హీరో, హీరోయిన్ ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తయింది. తప్పకుండా ఈ చిత్రం సుమంత్ కెరీర్‌లో మరో వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం వుంది అని తెలిపారు.

ఈ చిత్రంలో సుబ్రహ్మాణ్యం స్వామిపై వున్న ఓ అద్భుతమైన పాటకు ప్రముఖ పాటల రచయిత జోన్నవిత్తుల రామలింగేశ్వరరావు సాహిత్యాన్ని అందించగా, ఆ సాహిత్యాన్ని మెచ్చిన లెజెండరీ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం ఆ పాటకు గాత్రాన్ని అందించడాని అంగీకరించడం మా అదృష్టంగా భావిస్తున్నామని ఆ పాట చిత్రానికి హైలైట్‌గా నిలవబోతుందని భావిస్తున్నామని నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ అనుగ్రహించే దేవుడే ఆగ్రహిస్తే ఆ భక్తుల పరిస్థితి ఏమిటి అనే నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో సుమంత్ నాస్తికుడిగా, దేవుడంటే నమ్మకం లేని వ్యక్తిగా కనిపిస్తారు. తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతుందని నమ్మకం వుంది అని తెలిపారు.

సుమంత్, ఇషారెబ్బ,తనికెళ్ల భరణి, సాయికుమార్, అలీ, సురేష్, జోష్ రవి, భద్రమ్ గిరి, మాధవి, హర్షిణి, టీఎన్‌ఆర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కళా దర్శకత్వం: లక్ష్మీసింధూజ గ్రంధి, ప్రాజెక్ట్ డిజైనర్: కృష్ణ చిత్తనూర్, ైస్టెలింగ్: సుష్మ త్రిపురాన, ప్రొడక్షన్ కంట్రోలర్:సలాన బాలగోపాలరావు, మూలకథ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రచనా సహకారం: నాగమురళీధర్ నామాల, నిర్మాత: బీరం సుధాకర్‌రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.

More News

కొత్త సినిమాతో ప్రిన్స్ గ్రాండ్ రీ ఎంట్రీ

ఏ భాషలో అయినా ప్రేమకథలకు ఆదరణ తగ్గదు. అన్ని భాషల నుంచీ ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయి. అందుకే ప్రతి కథనూ కాస్త కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది.

మెగా హీరోతో ర‌మ్య‌కృష్ణ‌

చిరంజీవి, నాగార్జున‌తో ర‌మ్య‌కృష్ణ‌కు మంచి ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. తాజాగా నాగార్జున త‌న‌యుడు నాగ‌చైత‌న్య‌తో ఆమె 'శైల‌జా రెడ్డి అల్లుడు' సినిమాలో న‌టిస్తున్నారు.

త్రిష‌,స‌మంత‌ స్థానంలో అనుష్క‌?

త్రిష‌, స‌మంత  స్థానంలోకి అనుష్క రానుందా? ఇప్ప‌టికిప్పుడు వారి స్థానాల్లోకి అనుష్క ఎందుకు వ‌స్తోంది? అని అనుకుంటున్నారా?  నిజంగానే వారి స్థానంలోకి అనుష్క రానుంద‌ట‌.

ప్రభుదేవా సాంగ్‌ రీమిక్స్‌లో... 

శంకర్‌ దర్శకత్వంలో ప్రభుదేవా హీరోగా నటించిన చిత్రం 'ప్రేమికుడు'. 1994లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో 'ఊర్వశి ఊర్వశి...' అనే పాట యూత్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది.

సైమా ప్రెస్ నోట్..

7వ సౌత్ ఇండియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ (సైమా) సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌నుంది.