సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో హీరోగా హిట్ కొట్టిన సాయిధరమ్‌తేజ్ ముచ్చటగా మూడోసారి చేసిన ప్రయత్నమే 'సుబ్రమణ్యం ఫర్ సేల్'. 'రామయ్యా వస్తావయ్యా' వంటి ప్లాప్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలోనే ఈ సినిమా అనగానే అభిమానుల్లో హరీష్ సాయిని ఎలా ప్రెజంట్ చేస్తాడోనని ఆసక్తి పెరిగింది. మావయ్య పవన్‌తో 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ మూవీ చేసిన హరీష్ అల్లుడు తేజ్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' అనే టైటిల్ పెట్టడం దగ్గర నుండి ప్రతి విషయంలో కేర్ తీసుకుని చేసిన సినిమా అని ముందు నుండి యూనిట్ చెబుతూ వచ్చారు. మరి ఈ సినిమాలో సాయిధరమ్‌ని కరెక్ట్ ప్రైజ్‌కి సేల్ చేశాడా, లేదా అని తెలుసుకోవాంటే సినిమా కథలోకి వెళ్ళాల్సిందే...
కథ
కర్నూల్ లో రెడ్డప్ప(సుమన్), బుజ్జి(రావు రమేష్)ని ఓ సందర్భంలో అవమానించి ఊరి నుండి తరిమేస్తాడు. దాంతో రెడ్డప్పపై పగ పెంచుకున్న బుజ్జి రెడప్ప కూతురు సీత(రెజీనా) తన ప్రేమికుడు అభిరామ్(రణధీర్)ను కలుసుకోవడానికి అమెరికా వెళుతుంటే సహాయం చేసి తిరిగి రావద్దని హెచ్చరిస్తాడు. అమెరికాకి వెళ్ళిన సీతకి ఎయిర్‌పోర్టులో సుబ్రమణ్యం(సాయిధరమ్‌తేజ్) పరిచయం అవుతాడు. సుబ్రమణ్యం కొన్ని పరిస్థితుల్లో చదువుకోడానికి అమెరికా వచ్చి అక్కడ పార్ట్ టైమ్ జాబ్‌లు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. అభిరామ్ మోసగాడని తెలుసుకున్న సీతకి సుబ్బు షెల్టర్ ఇస్తాడు. ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేయడానికి సుబ్రమణ్యం, సీత కర్నూల్ వస్తారు. అక్కడ గోవింద్ గౌడ్, అతని మనుషులు సుబ్రమణ్యం వెనుకపడతారు. వాళ్ళ నుండి ప్లాన్ ప్రకారం తప్పించుకన్న సుబ్బు సీత ఇంట్లో వాళ్ళకి దగ్గరవుతాడు. సీత చెల్లి(తేజస్వి)కి పెళ్ళి కుదురుతుంది. వాళ్శ పెళ్లి కోసం సుబ్బు, సీత భార్యభర్తలమని చెప్పి అబద్ధాన్ని దాస్తారు. అప్పుడేం అవుతుంది? అసలు గోవింద్ గౌడ్ ఎవరు? సబ్బుకి, గోవింద్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? అసలు నిజం ఎలాంటి పరిస్థితుల్లో బయటపడుతుందనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్
సాయధరమ్ యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయింది. ఫుల్ ఎనర్జీతో సినిమాని నడిపించాడు. మంచి పెర్‌ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ని తనవైపుకి తిప్పుకున్నాడు. డ్యాన్సులు, యాక్షన్ పార్ట్‌లో కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా వాళ్ళ మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను చక్కగా ఇమిటేట్ చేశాడు. రెజీనా గ్లామర్‌తో పాటు పెర్‌ఫార్మెన్స్ పరంగా చక్కగా నటించింది. సెంటిమెంట్ సీన్స్‌లో మంచి నటనను ఎలా కనపరిచిందో అలాగే పాటల్లో గ్లామర్‌గా కనపడింది. చింతకాయ్ అనే పేరుతో బ్రహ్మానందం వంటవాడుగా అమెరికాలో, ఇండియాలో చేసిన కామెడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అజయ్, రావురమేష్, నరేష్, ఝాన్సీ, తేజస్వి, ఫిష్ వెంకట్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ కథ పాతదే అయినా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపించాడు. సినిమాలో తేజ్ ఇంట్రడక్షన్ సీన్ లో పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో సాంగ్‌ను ఇమిటేట్ చేయడం, చాలా వరకు సన్నివేశాల్లో చిరంజీవిని ఫాలో కావడం వంటి మేనరిజమ్స్‌తో ఫ్యాన్స్‌ను ఆక్టటుకునే ప్రయత్నం చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మిక్కి జె.మేయర్ సంగీతం బావుంది. తొలిసారి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కి మిక్కి చక్కని మ్యూజిక్ అందించాడు. టైటిల్ సాంగ్, తెలుగంటే..., ఏమైందో ఏమో ఓ మై లవ్ ... అనే సాంగ్స్‌తో పాటు చిరంజీవి గువ్వా గోరికంతో...రీమిక్స్ సాంగ్స్ మ్యూజిక్, చిత్రీకరణ ప్రేక్షకకులను ఆకట్టుకుంటుంది. ఈ రీమిక్స్ సాంగ్ లోకేషన్ కానీ, పిక్చరైజేషన్ సూపర్. కెమెరావర్క్ ఆడియన్స్‌కి నచ్చుతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి సీన్‌ను రిచ్‌గా చూపించాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ కంపోజిషన్ చాలా బావుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్
సినిమా ఫస్టాఫ్‌లో తొలి ఇరవై నిమిషాలు కొద్దిగా స్లోగా, బోరింగ్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్ పరావాలేదు. అలాగే క్లైమాక్స్‌లో సెంటిమెంట్ డోస్ కాస్తా ఎక్కువైంది. సినిమా కథంతా ఎక్కడో చూసిన సినిమాల్లోలాగానే కనపడతాయి. సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే టైటిల్‌కి మొదటి ఫదిహేను నిమిషాలు మాత్రమే న్యాయం చేసినట్టు కనపడుతుంది. మిగతాదంతా రోటీన్ ఫార్ములా కథలాగానే ఉంటుంది. పెద్ద పెద్ద విలన్స్‌ను హీరో ఫూల్ చేయడం అంతా మనకు ఓకేలా కనపడుతుంది.
విశ్లేషణ
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా వచ్చిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' చిత్రాన్ని దర్శకుడు హరీష్ చక్కగానే హ్యండిల్ చేశాడు. ఎక్కువగా హీరో బాడీ లాంగ్వేజ్‌ను టాప్ స్టార్స్ అయిన చిరు, పవన్‌లను ఇమిటేట్ చేయడానికి ఉపయోగించుకున్నాడు. డ్యాన్సులు, ఫైట్స్‌లో తేజ్ ఫుల్ ఎనర్జీని చూపించాడు. కామెడి టైమింగ్ బావుంది.ఫస్టాఫ్‌లో బ్రహ్మానందం కామెడి బాగుంది. సెకండాఫ్ వచ్చేసరికి ప్రభాస్ శ్రీను, ఫిష్ వెంకట్, బ్రహ్మానందంలు కామెడి పర్సంటేజ్‌ను తగ్గకుండా చూడడంలో తమపాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో బ్రహ్మానందం కామెడి కంటే ఫిష్ వెంకట్ కామెడి బావుంది. డబ్బు కోసం దిగుతానేమో కానీ, దిగజారిపోను పవర్‌ఫుల్ డైలాగ్, ఎవడో యాపిల్ కాయ అని పెట్టుకుంటే నమ్ముతారు కానీ అవకాయ అని పెట్టుకుంటే నమ్మరా ...అనే కామెడి డైలాగ్స్ ఇలా సిచ్యువేషన్‌కి తగిన విధంగా రాసిన డైలాగ్స్ హరీష్‌లో మంచి రైటర్‌ని మరోసారి బయటపెట్టింది. మొత్తం మీద 'సుబ్రమణ్యం ఫర్ సేల్' క్లాస్ కంటే మాస్ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది.
బాటమ్ లైన్: 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఎంజాయ్ చేసే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
రేటింగ్ - 3.25/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments