'సుబ్రమణ్యం ఫర్ సేల్' శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న...

  • IndiaGlitz, [Tuesday,September 01 2015]

రేయ్' తొలి సినిమాగా స్టార్టయినా పిల్లా నువ్వులేని జీవితం' ముందుగా రిలీజ్ కావడం పెద్ద హిట్ కావడం సాయిధరమ్ తేజ్ కి బాగా కలిసి వచ్చింది. వెంటనే దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో నటించేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 24న రిలీజ్ కానుంది. మంచి క్రేజీ కాంబినేషన్ తోరూపొందిన ఈ సినిమా బిజినెస్ అప్పుడే పూర్తయిపోయిందట.

అంతే కాకుండా శాటిలైట్ హక్కులు కూడా మంచి రేటుకే అమ్ముడైపోయాయని టాక్. ఫిలింనగర్ వర్గాల సమాచారం మేరకు మా టీవీ సంస్థ ఈ సినిమా శాటిలైట్ హక్కులను దాదాపు నాలుగు కోట్ల రూపాయాలతో చేజిక్కించుకున్నారట. మూడో సినిమాకే మంచి మార్కెట్ రావడం ఓ రకంగా సాయిధరమ్ అదృష్టమనే చెప్పాలి.