ఆగష్టు 23న 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరో గా, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్సాధించిన హరీష్ శంకర్ దర్శకుడి గా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న భారీ కమర్షియల్ ఎంటర్టైనర్, 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్'.
ఈ చిత్రం ఆడియో ఆల్బం ను ఆగష్టు 23 న భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధపడుతోంది. అలాగే సెప్టెంబర్ 24న భారీ స్థాయి లో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తం గా విడుదల చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం లో హీరో కారెక్టరైజేషన్ హైలైట్ గా ఉంటుంది అని, సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో నే ఒక మయిలురాయి గా నిలిచే చిత్రం అవుతుంది అని దర్శకులు హరీష్ శంకర్ చెబుతున్నారు.
"ప్రెక్షకులను, మెగా ఫ్యామిలీ అభిమానులను అలరించటానికి, మెగాస్టార్ చిరంజీవి గారి పాటను రీమిక్స్ చెసాము. ఇది ఈ చిత్రానికి ఒక ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది " అని నిర్మాత దిల్ రాజు అన్నారు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చే చిత్రాలకు ఉండే ఉన్నతమైన సాంకేతిక విలువలు, హరీష్ శంకర్ రాసే పదునైన సంభాషణలు, సాయి ధరం తేజ్ అధ్బుతమైన డాన్స్ మరియు నటన, రెజినా గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు గా నిలుస్తాయి అని చిత్ర బృందం చెబుతోంది. అమెరికా లో 35 రోజుల పాటు ఎన్నో అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది ఈ చిత్రం.
సాయి ధరమ్ తేజ్, రెజినా , నాగబాబు, కోటా శ్రీనివాస రావు, పృథ్వి, రావు రమేష్ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫి : C రామ్ ప్రసాద్ . ఎడిటింగ్ : గౌతం రాజు . ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, వెంకట్ . స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, సతీష్ వేగేశ్న, తోట ప్రసాద్ . కో ప్రొడ్యూసర్స్ - శిరీష్, లక్ష్మణ్. నిర్మాత - దిల్ రాజు. కథ - మాటలు - దర్శకత్వం : హరీష్ శంకర్. ఎస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com