వెయ్యి కోట్లతో సినిమా తీస్తా - సుభాష్ కరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం `2.0` ఫీవర్ కొనసాగుతుంది. `రోబో` సీక్వెల్‌గా నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఏషియాలోనే సెకండ్ హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా.. ఇండియాలోనే తొలి హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా సినిమా రూపొందింది. సినిమా కోసం దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంతలా.. విజువల్ వండర్‌గా ఓ సినిమాను రావాలంటే నిర్మాత సహకారం ఎంతో అవసరం. ఇంత బడ్జెట్ పెట్టిన లైకా ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత సుభాష్ కరణ్‌కు అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఈ సినిమా బడ్జెట్ గురించి సుభాష్ కరణ్ మాట్లాడుతూ ``శంకర్ `2.0` సినిమా కోసం నిర్మాతల్ని వెతుకుతున్నారని తెలిసింది. బడ్జెట్ 350 కోట్లు అని తెలిసింది. అయితే సమయం, సినిమా స్పాన్‌ను పెంచే క్రమంలో అంతా కలుపుకుని సినిమా 550 కోట్ల రూపాయల వరకు అయ్యింది. అయితే ఏ ఆందోళన లేదు. కచ్చితంగా ఓ గొప్ప సినిమాను ఇస్తున్నామనే ధీమా ఉంది. శంకర్‌పై నమ్మకంతోనే ఇండియన్ 2 చేయబోతున్నాను. శంకర్ అనే కాదు.. మంచి కథ, అద్భుతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కించే ఎవరైనా ముందుకొస్తే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి అయినా సినిమా తీస్తాను` అంటూ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments