వెయ్యి కోట్ల‌తో సినిమా తీస్తా - సుభాష్ క‌ర‌ణ్‌

  • IndiaGlitz, [Sunday,November 04 2018]

ప్ర‌స్తుతం '2.0' ఫీవ‌ర్ కొన‌సాగుతుంది. 'రోబో' సీక్వెల్‌గా నవంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఏషియాలోనే సెకండ్ హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీగా.. ఇండియాలోనే తొలి హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ మూవీగా సినిమా రూపొందింది. సినిమా కోసం దాదాపు 600 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు. ఇంత‌లా.. విజువ‌ల్ వండ‌ర్‌గా ఓ సినిమాను రావాలంటే నిర్మాత స‌హకారం ఎంతో అవ‌స‌రం. ఇంత బ‌డ్జెట్ పెట్టిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌, నిర్మాత సుభాష్ క‌ర‌ణ్‌కు అంద‌రూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఈ సినిమా బ‌డ్జెట్ గురించి సుభాష్ క‌ర‌ణ్ మాట్లాడుతూ ''శంక‌ర్ '2.0' సినిమా కోసం నిర్మాత‌ల్ని వెతుకుతున్నార‌ని తెలిసింది. బ‌డ్జెట్ 350 కోట్లు అని తెలిసింది. అయితే స‌మ‌యం, సినిమా స్పాన్‌ను పెంచే క్ర‌మంలో అంతా క‌లుపుకుని సినిమా 550 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు అయ్యింది. అయితే ఏ ఆందోళ‌న లేదు. క‌చ్చితంగా ఓ గొప్ప సినిమాను ఇస్తున్నామ‌నే ధీమా ఉంది. శంక‌ర్‌పై న‌మ్మ‌కంతోనే ఇండియ‌న్ 2 చేయ‌బోతున్నాను. శంక‌ర్ అనే కాదు.. మంచి క‌థ‌, అద్భుత‌మైన నిర్మాణ విలువ‌ల‌తో తెర‌కెక్కించే ఎవ‌రైనా ముందుకొస్తే వెయ్యి కోట్లు ఖ‌ర్చు పెట్టి అయినా సినిమా తీస్తాను' అంటూ చెప్పుకొచ్చారు.

More News

డిస్కో డాన్స‌ర్ పాత్ర‌లో ర‌వితేజ‌...

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌వితేజ డ‌బుల్ రోల్ చేస్తున్నారు.

'టాక్సీవాలా' మ‌రో రోజు ఆల‌స్యంగా...

క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.కె.ఎన్ నిర్మించిన చిత్రం 'టాక్సీ వాలా'.

విక్ర‌మ్‌కుమార్‌తో నాని?

'13బి, మ‌నం, ఇష్క్‌, 24, హ‌లో' వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన దర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ త్వ‌ర‌లోనే నేచ‌ర‌ల్ స్టార్ నానితో సినిమా చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

ఫ్యాన్సీ రేటుకు 'య‌న్‌.టి.ఆర్' ఓవ‌ర్‌సీస్ హ‌క్కులు

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి 'ఎన్టీఆర్' బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. అందులో మొద‌టిది 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది.

'ఓడియ‌న్' చిత్రం తెలుగు హక్కులు ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్న‌ 'ద‌గ్గుపాటి క్రియేషన్స్'

మూవీ లెజెండ్ మెహ‌న్ లాల్ మలయాళం లో నటిస్తున్న అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ "ఓడియ‌న్". ఈ చిత్రానికి అక్క‌డే కాకుండా తెలుగు ట్రేడ్ లో కూడా చాలా మంచి క్రేజ్ వుంది.