'డైనమైట్ ' చిత్రాన్ని చేసినందుకు మంచు విష్ణుని అభినందిస్తున్నాను - సుబ్బరామిరెడ్డి

  • IndiaGlitz, [Monday,September 07 2015]

మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం డైనమైట్'. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై దేవాకట్టా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ తో ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా ఆదివారంనాడు డైనమైట్' చిత్ర స్పెషల్ షోను టి.సుబ్బరామిరెడ్డి ప్రసాద్ ల్యాబ్స్ లో చూశారు.

షో అనంతరం ఆయన మాట్లాడుతూ 'డైనమైట్ ను చాలా కొత్త టెక్నిక్ తో తీసినట్టు తెలుస్తుంది. మంచు విష్ణు చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధానబలం. సినిమా స్టార్టింగ్ సీన్ నుండి ఎండింగ్ సీన్ వరకు చాలా థ్రిల్లింగ్, సస్పెన్స్ తో ముందుకు సాగింది. ప్రణీత బాగా యాక్ట చేసింది. మ్యూజిక్ బావుంది. ఇంగ్లీష్ సినిమా స్థాయిలో ఈ సినిమాని రూపొందించిన విష్ణుని అభినందిస్తున్నాను'' అన్నారు.