టీఎస్సార్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటించిన సుబ్బరామిరెడ్డి
- IndiaGlitz, [Thursday,April 06 2017]
2015-16 సంవత్సరానికిగానూ టీఎస్సార్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డులను గురువారం ఉదయం హైదరాబాద్లో ప్రకటించారు. ఈ సందర్భంగా..టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ''అవార్డుల ప్రకటిన 30 రోజలు సమయం తీసుకున్నాం. అందులో భాగంగా 2015-16కుగానూ అవార్డులను ప్రకటిస్తున్నాం. ఇందులో ప్రేక్షకులు ఎంపిక చేసిన అవార్డులు, కమిటీ సభ్యులు ఎంపిక చేసే అవార్డులు ఉంటాయి.
ఈ అవార్డుల వేడుకను వైజాగ్లో ఒకే వేదికపై యాబై వేల మంది వీక్షించేలా సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుక ఈ నెల 8న వైజాగ్లో జరగనుంది. టీవీ9తో పాటు మిగిలిన అన్ని ఛానెళ్లకు కూడా అరగంట తేడాతో మా కార్యక్రమాన్ని ప్రసారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం'' అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పింకిరెడ్డి బి.గోపాల్, రఘురామ కృష్ణంరాజు, టీవీ9 విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.