ట్విట్టర్ ట్రెండింగ్‌లో స్టైలిష్ స్టార్
Send us your feedback to audioarticles@vaarta.com
ట్రెండ్ సెట్ చేయడంలో మెగా ఫ్యామిలీ రూటే సెపరేటు. చిరు నుంచి మొదలుకుని ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ.. చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్లుగా ఎదిగారు. ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్‌గా అల్లు అర్జున్ ఘన విజయాలు సాధించారు. అల వైకుంఠపురములో సినిమాతో ఆయన క్రేజ్ ఎంతటిదో మరోసారి రుజువైంది. నాన్ బాహుబలి క్యాటగరీలో.. భారీ విజయాన్ని నమోదు చేసి.. కాసుల వర్షం కురిపించింది. ఎటువంటి ప్యాన్ ఇండియా ట్యాగ్ లేకుండానే విడుదలై.. అంతటి విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విజయానందంలో ఉన్న అల్లు అర్జున్.. తన ప్రమోషన్స్ కూడా అంతే రేంజ్‌లో కొనసాగిస్తున్నారు. జాతీయ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ.. ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తాజాగా ఎన్డీటీవీకి బన్నీ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఇది ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. #AlluArjunOnNDTV హ్యాష్ ట్యాగ్‌తో బన్నీని ప్రశ్నలు అడగొచ్చనే ఎన్డీటీవీ తెలిపింది. దీంతో ఈ విషయన్ని అల్లు ఫ్యాన్స్ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం ట్విట్టర్ ట్రెండింగ్‌లో టాప్ 20లో ఉంది. ఎన్డీటీవీ ఇంర్వ్యూతో దేశవ్యాప్తంగా మళ్లీ మనోడు ట్రెండ్ అవ్వనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ ఇంటర్వ్యూ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో బన్నీ పాల్గొననున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అవసరం లేని సీన్లను డైరెక్టర్ సుక్కు షూట్ చేస్తున్నారు. బన్నీ రాగానే సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com