విశాల్, తమన్నా, జగపతిబాబు ల సూపర్ కాంబినేషన్ లో భారీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్
Send us your feedback to audioarticles@vaarta.com
పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత రాయుడుతో మరో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మాస్ విశాల్ కొత్త చిత్రం జూన్ 9 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. 'రాయుడు' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని ఇచ్చిన జి.హరి హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ఈ భారీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర విశేషాలను నిర్మాత జి.హరి తెలియజేస్తూ - ''భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో చేస్తున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. నిర్మాతగా నాకు చాలా ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. విశాల్ కెరీర్లో ఇది చాలా హై రేంజ్ మూవీగా నిలుస్తుంది. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. విశాల్‌తో నేను చేసిన 'రాయుడు' భారీ ఓపెనింగ్స్ సాధించడమే కాకుండా రిలీజ్ అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. 'రాయుడు' సూపర్‌హిట్ అయిన ఈ ఆనంద సమయంలో విశాల్‌తో స్ట్రెయిట్ సినిమా ఎనౌన్స్ చెయ్యడం మరింత ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం విశాల్ కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. విశాల్, తమన్నా జంట ఈ సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతుంది. ఇందులో జగపతిబాబుగారు మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే తరుణ్ అరోరా మరో విలన్‌గా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పాటల రికార్డింగ్ పూర్తయింది. జూన్ 9 నుంచి నెలరోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుంది. మిగతా షెడ్యూల్స్ చెన్నై, ఫారిన్లలో చేస్తాం'' అన్నారు.
మాస్ హీరో విశాల్, తమన్నా, జగపతిబాబు, నిరోషా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సూరి, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్స్, ఎడిటింగ్: సెల్వ, ఫైట్స్: దినేష్, అనల్ అరసు, ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్.జి.ప్రేమానందన్, సహనిర్మాతలు: ఎం.పురుషోత్తం, ఇ.కె.ప్రకాష్, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com