CM YS Jagan:జగన్‌పై అభిమానం చాటుకున్న విద్యార్ధులు.. రాఖీ ఆకారంలో ముఖ్యమంత్రిపై మమకారం
Send us your feedback to audioarticles@vaarta.com
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య బంధానికి, ప్రేమానురాగాలకు ప్రతిరూపంగా చెప్పుకునే రక్షాబంధన్ పర్వదినాన్ని భారతీయులు ఘనంగా జరుపుకుంటున్నారు. నగరాలు, పల్లెల్లో సోదరీమణులు.. తమ సోదరులకు రాఖీ కట్టి వారు సుఖ సంతోషాలతో వుండాలని దీవిస్తున్నారు. ఈ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల రాష్ట్ర ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అక్కాచెల్లెమ్మలకు సోదరుడిగా అండగా నిలుస్తోన్న జగన్ :
అక్కాచెల్లెమ్మలకు తోబుట్టువుగా.. చిన్నారులకు మేనమామగా అండగా వుంటున్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాలతో తమకు ఎంతో లబ్ధి చేకూరుస్తున్న ముఖ్యమంత్రిపై అభిమానాన్ని చాటుకున్నారు. సోదర ప్రేమను తెలియజేస్తూ మానవ సమూహారంగా ఏర్పడిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాఖీ ఆకారంలో స్టూడెంట్లు మానవహారంగా ఏర్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా పాఠశాలల్లో బాలికలు స్థానిక వైసీపీ నేతలకు రాఖీలు కట్టారు. రాష్ట్రానికి రక్ష జగనన్న అంటూ నినాదాలు చేస్తున్నారు. దీనిని బట్టి వారి మనసులో జగన్ స్థానం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. విద్యార్ధుల మనసుల్లో జగన్ మీద వున్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే ఈ ఆకారాలు అని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
మహిళలకు జగన్ రాఖీ శుభాకాంక్షలు :
ఇదిలావుండగా.. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు , ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. వారు చూపుతున్న ప్రేమాభిమానులకు సదా కృతజ్ఞుడినని .. మహిళల సంక్షేమమే లక్ష్యంగా, వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషంగా వుందన్నారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా వుంటానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
మహిళా సాధికారికతకు జగన్ కృషి :
అటు వైసీపీ కూడా ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఒక సోదరుడిగా రాష్ట్రంలోని ప్రతి అక్కచెల్లమ్మకు ఆర్ధికంగా, సామాజికంగా , విద్యాపరంగా, ఉద్యోగపరంగా , రాజకీయ సాధికారత కల్పిస్తూ ఈ నాలుగేళ్ల పాలనలో దేశ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా అన్ని అంశాల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు సీఎం జగన్. అక్కచెల్లెమ్మలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటూ రాష్ట్రంలోని ప్రతి సోదరికి రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ వైసీపీ ట్వీట్‌లో పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout