పాముకాటుకు విద్యార్థి బలి.. జగన్ చేయూత, బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం
Send us your feedback to audioarticles@vaarta.com
విజయనగరం జిల్లా కురుపాంలో గురుకుల హాస్టల్లో ముగ్గురు విద్యార్థులను పాము కాటేసిన ఘటనలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రంజిత్ అనే విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి సీఎం జగన్‌కు మంత్రులు పుష్పశ్రీవాణి, వేణుగోపాలకృష్ణలు సమాచారం అందించారు. విద్యార్థి మృతి వార్త తెలిసుకున్న జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే విద్యార్థి రంజిత్ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. విజయనగరం కలెక్టర్ సూర్యకుమారి ఆ పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందజేయనున్నారు.
కురుపాంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యాలయంలో గురువారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో విద్యార్థులను పాము కాటువేసింది. విద్యార్ధుల అరుపులు, కేకలతో రంగంలోకి దిగిన సిబ్బంది హుటాహుటిన వారిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మరణించాడు.
పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థులను ఎనిమిదో తరగతి చదువుతోన్న మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ, వంగపండు నవీన్‌గా అధికారులు గుర్తించారు. వీరిలో రంజిత్ మృతిచెందగా.. మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా.. మరొకరి పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout