ఆళ్లగడ్డ నుంచి బలమైన అభ్యర్థిని నిలబెడతా..
Send us your feedback to audioarticles@vaarta.com
రాయలసీమ ప్రాంతం కుటుంబాల ఆధిపత్యంలో నలిగిపోతోందని, కుటుంబాల కంచుకోటల్ని బద్దలు కొట్టాలంటే ప్రజల్లో ధైర్యం రావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆళ్ళగడ్డ ఏ ఒక్క కుటుంబ గుత్తాధిపత్యం కాదన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి బలమైన అభ్యర్ధిని బరిలో నిలబెడతామని వెల్లడించారు. రాయలసీమలో ఎన్ని సీట్లు వస్తాయన్నది ముఖ్యం కాదు.. ఎంత మార్పు తీసుకొస్తామన్నది ముఖ్యం అన్నారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండబోవని పునరుద్ఘాటించారు.
మంగళవారం ఆళ్ళగడ్డలో బహిరంగసభ పవన్ ప్రసంగిస్తూ.. “2014 ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీకి ప్రచారం చేశాను. రాష్ట్రమంతా తిరిగాను కానీ ఆళ్ళగడ్డ రాలేదు. భూమా నాగిరెడ్డి మా వాళ్లకు ఫోన్ చేసి మీరు వస్తే మా విజయావకాశాలు దెబ్బతింటాయి రావొద్దని కోరారు. శోభానాగిరెడ్డి చనిపోయి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లిపోయాను. నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. 2019ఎన్నికల్లో మాత్రం ఆళ్ళగడ్డ నుంచి పేదలు కష్టాలు తెలిసిన వ్యక్తిని ఎన్నికల్లో నిలబెడతాం. కులాలు పేరు చెప్పి కుటుంబాలు బాగుపడ్డాయి తప్ప ప్రజలు బాగుపడలేదు. ఈ నేల ఏ ఒక్కరిది కాదు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల వారిది. నేను ఏ ఒక్క సామాజిక వర్గానికో కొమ్ముకాసేవాడిని కాదు. కులాలు, మతాలకు అతీతంగా అందరూ బాగుండాలని చెప్పి జనసేన పార్టీ పెట్టాను" అని పవన్ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout