20 ఏళ్లప్పుడే పెళ్లి గురించి ఒత్తిడి చేశారు: అనుష్క

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

స్టార్ హీరోయిన్ అనుష్క ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తే చాలు.. ఆ ఇంటర్వ్యూలో తప్పని సరిగా వివాహానికి సంబంధించిన ఒక ప్రశ్న ఉండి తీరుతుంది. 40కి చేరువలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ పెళ్లి వార్తను వెల్లడించలేదు. దీంతో ఆమె పెళ్లెప్పుడనే దానిపై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. కాగా.. కొన్ని నెలలుగా అనుష్క వివాహం చేసుకోబోతోందంటూ అందుకే సినిమాలను తగ్గించేసిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అనుష్క పెళ్లి వార్తలు ఇప్పటికే ఎన్నో వచ్చాయి. తన పెళ్లి గురించి అనుష్క ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఆ ప్రశ్నలు ఆగడం మాత్రం మానడం లేదు. తాజాగా అనుష్కకు ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న మరోమారు ఎదురైంది. దీనిపై స్పందించిన అనుష్క.. తాను వివాహ వ్యవస్థను నమ్ముతానని తెలిపింది. పిల్లలు కూడా ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. అయితే వివాహ విషయంలో తనకు తొందర లేదని.. తనకు నచ్చినవాడు ఎదురుపడినప్పుడే వివాహం చేసుకుంటానని అనుష్క తెలిపింది.

కాగా.. తనకు 20 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడే తల్లిదండ్రులు పెళ్లి గురించి ఒత్తిడి చేశారని వెల్లడించింది. అయితే ప్రస్తుతం వారి ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చిందని అనుష్క వెల్లడించింది. కాగా.. ఇటీవలే ‘నిశ్శబ్దం’ సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ సినిమాలో అనుష్క ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటించింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమాకు అనుష్క నటనే హైలైట్‌గా నిలిచింది.

More News

ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్..

ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయింది. ఎన్నికల కమిషన్‌కు ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టులో

నోయెల్ రీఎంట్రీ.. షాక్ ఇస్తున్న వీడియో..

‘బిగ్‌బాస్’ ఏదైనా జరగొచ్చు అని ఎప్పుడో చెప్పేశారు. ఇక అంతా అయిపోయింది. సింగర్ నోయెల్‌కు సెండాఫ్ కూడా ఇచ్చేశారు.

ఇటు చిరు.. అటు రజినీ.. దక్షిణాదిలో సినీ ప్రముఖులే టార్గెట్..

సూపర్‌స్టార్ రజినీకాంత్ కాషాయ తీర్థం తీసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి.

ప‌వ‌న్ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా ఖ‌రారైందా..?

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

`రాధేశ్యామ్` నుండి తిరిగొచ్చేసిన పూజాహెగ్డే..

`రాధేశ్యామ్` నుండి పూజా హెగ్డే తిరిగొచ్చేసిందా! అంటే అవును నిజ‌మే అనాలి.