మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్

  • IndiaGlitz, [Friday,January 05 2018]

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన చిత్రం స్ట్రీట్ లైట్స్. ప్లే హౌస్ మోషన్ పిక్చర్ ప్రై.లి నిర్మాణంలో శ్యామ్ దత్ సైనుద్దీన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. విభిన్నమైన కథల్ని ఎంచుకునే మమ్ముట్టి ఈ సారి కూడా ఆడియెన్స్ ని థ్రిల్ కు గురి చేసే కథాంశంతో స్ట్రీట్ లైట్స్ చిత్రంతో రానున్నారు. ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథ ఇది. తమిళ, మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని స్ట్రీట్ లైట్స్ పేరుతోనే రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... మమ్ముట్టికి తెలుగులో వీరాభిమానులున్నారు. ఆయనుకున్న క్రేజ్ దృష్ట్యా స్ట్రీట్ లైట్స్ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. స్ట్రీట్ లైట్స్ తెలుగు టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు శ్యామ్ దత్ చెప్పిన కథ, కథనం ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. క్రైం థ్రిల్లర్ గా సాగా ఈ కథ అందరినీ మెప్పిస్తుంది. మమ్ముట్టి గారి కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. అని అన్నారు.

నటీనటులు ..మమ్ముట్టి, స్టంట్ శివ, మొట్ట రాజేంద్ర, పాండి రాజన్, మనోబాల, బ్లాక్ పాండి, శ్రీరామ్, పృథ్వీ పాండిరాజ్, సంపత్ రామ్, రోనీ, మాస్టర్ ఆశిష్, మురుగన్, జుడే ఆంటోని, సోహన్ లాల్, లిజో మోల్, సెమ్మలార్, పొన్నం బాబు, సెమ్మా జీ నాయర్