పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి వింత వ్యాధి కలకలం..
Send us your feedback to audioarticles@vaarta.com
పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి వింత వ్యాధి కలకలం రేపింది. ఇప్పటికే ఏలూరులో వింత వ్యాధి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అదే తరహాలో భీమడోలు మండల పూళ్ల గ్రామంలో సైతం పలువురు వింత వ్యాధి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ఉన్నట్టుండి సడెన్‌గా కళ్లు తిరిగి కింద పడిపోతుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 16 మందికి పైగా అనారోగ్యం పాలవగా, వారిలో కొందరికి మూర్ఛ లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురిచేసింది. వారిని పరీక్షించిన వైద్యులు ఫుడ్‌పాయిజన్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
ఏపీలో ఇలా జరగడం ఇధి మూడోసారి కావడం గమనార్హం. ఏలూరు తరహా లక్షణాలతో అస్వస్థతకు గురి కావడం ఇటీవల తరచుగా జరుగుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో కూడా ఇదే తరహా ఘటన చోటుకుంది. నడికుడి కాలనీ వాసుల్లో కొందరు అకస్మాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. కాగా.. వీరి అనారోగ్యానికి కారణం సమీపంలోని రసాయన పరిశ్రమేనని.. దాని నుంచి అర్ధరాత్రి సమయంలో ఆ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు విడుదలవుతాయని.. వాటి ప్రభావం వల్లే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.
కాగా, గతేడాది డిసెంబరులో ఏలూరులో తొలుత ఈ తరహా ఘటన వెలుగు చూసింది. డిసెంబర్ 4 నుంచి 12వ తేదీ మధ్య వారం రోజుల పాటు 622 మంది బాధితులు అస్వస్థతతో కళ్లు తిరిగి పడిపోయి ఆసుపత్రుల్లో చేరారు. అకస్మాత్తుగా మూర్చపోవడం, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం వంటి లక్షణాలు వీరిలో కనిపించాయి. ఈ వ్యాధితో ఇద్దరు మరణించడం మరింత కలకలానికి కారణమైంది. తొలుత ఇలా ఎందుకు జరిగిందో వైద్యులకు సైతం అంతుపట్టలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం అత్యున్నత స్దాయి నిపుణులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.
దాదాపు 40 మందికి పైగా అధికారులు, నిపుణులు, డాక్టర్లతో కూడిన కమిటీ.. కొన్ని రోజుల పాటు ఏలూరులో విస్తృత స్థాయిలో పర్యటించింది. అక్కడ సేకరించిన శాంపిల్స్‌ను ప్రముఖ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించి చివరకు కారణాలను అయితే వెల్లడించింది. విషతుల్యంగా మారిన కూరగాయలే వింత వ్యాధికి కారణమని హై పవర్ కమిటీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే రైతులకు హై పవర్ కమిటీ పలు సూచనలు చేసింది. వింత వ్యాధి ప్రభావానికి గురైన ప్రాంతాలతో పాటు ఏలూరు నగర వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేసే నీటిపై దృష్టి పెట్టాలని కూడా నివేదికలో పేర్కొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments