భారత్‌లో మార్చిలోనే ప్రవేశించిన స్ట్రెయిన్: ఐజీఐబీ వెల్లడి
Send us your feedback to audioarticles@vaarta.com
కొవిడ్-19 మహమ్మారి క్రమక్రమంగా మ్యుటేషన్ చెందుతూ ఇబ్బందులు పెడుతూనే ఉంది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కాస్త బయటపడుతున్నామని రిలాక్స్ అవుతున్న సమయంలో కరోనా మ్యుటేషన్ చెందిందనే వార్త ప్రపంచాన్ని తిరిగి భయాందోళనలోకి నెట్టివేసింది. బ్రిటన్‌లో రూపాంతరం చెంది సూపర్ స్ర్పెడర్(స్ర్టైయిన్)గా మారి మరోసారి ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ఇతర దేశాలు సైతం భయాందోళన చెందుతున్నాయి. అయితే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్ఐఆర్) అనుబంధ సంస్థ అయిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్.. భారతీయులకు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
కొత్త స్ట్రెయిన్ భారత్‌లో ఈ ఏడాది మార్చిలోనే అడుగు పెట్టేసిందని అనురాగ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ సంస్థ ప్రస్తుత కొత్త రకం ప్రభావాన్ని గుర్తించడానికి వైరస్ జన్యు విశ్లేషణలో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే అప్పటి వరకూ ఉన్న వాటికంటే పూర్తి ప్రత్యేకంగా ఉన్న రకాలు ఈ ఏడాది మార్చిలోనే ఇక్కడ బయటపడ్డాయి. వాటిలో ఒక రకాన్ని సూపర్ స్ర్పెడర్‌గా గుర్తించారు. దీనికి ఏ4గా నామకరణం చేశారు. కాగా.. హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీలోని బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లో ఏ4 రకం సూపర్ స్ర్పెడర్ ఉంది. ఇది ఆగ్నేయ ఆసియాలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అయితే.. మనపై అంత ప్రభావం ఎందుకు చూపలేకపోయిందనే దానిపై కూడా అనురాగ్ అగర్వాల్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
మన వ్యాధి నిరోధక శక్తి కారణంగా అది బయటపడలేదని అనురాగ్ అగర్వాల్ అభిప్రాయ పడ్డారు. మన వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బకు జూన్ నాటికి దానికదే నాశనమై ఉండొచ్చని పేర్కొన్నారు. లేదంటే ఆ మూడు నెలల్లో పరిస్థితి మరో రకంగా ఉండేదని అనురాగ్ వెల్లడించారు. కాబట్టి ఈ కొత్త స్ట్రెయిన్ కారణంగా మనం పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఇప్పుడు కనిపిస్తున్న రకం చాలా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కచ్చితంగా ఉందన్నారు. వైరస్‌లోని మార్పులు బ్రిటన్ కంటే ఇక్కడే ఎక్కువని చెప్పారు. మార్పులు చెందిన రకాలను కూడా ప్రస్తుతం రానున్న టీకాలు సమర్థవంతంగా నిరోధిస్తాయని ఆశిస్తున్నామని అనురాగ్ అగర్వాల్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout