కృష్ణమ్మ వెనుక కథ....

  • IndiaGlitz, [Tuesday,December 13 2016]

క‌లియ‌గ దైవం వేంక‌టేశ్వ‌ర స్వామిని త‌న భ‌ర్త‌గా భావించుకుని పూజించే భ‌క్తురాలు, స‌న్నాసిని కృష్ణ‌మ్మ పాత్ర‌లో అనుష్క న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క లుక్ విడులైన‌ప్పుడు చాలా బావుందంటూ ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఈ సినిమాలో అనుష్క నాలుగు భిన్న‌మైన గెట‌ప్స్‌లో క‌న‌ప‌డ‌తారు. ఒక‌దానికొక‌టి పొంత‌న ఉండ‌కుండా ప్ర‌తి గెట‌ప్ డిఫ‌రెంట్‌గా ఉండేలా డిజైన‌ర్స్ జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. గోదాదేవి త‌ర‌హా గెట‌ప్ కావ‌డంతో అనుష్క శారీ, బ్లౌజ్‌కు 24 మీట‌ర్ల వ‌స్త్రం ప‌ట్టింద‌ట‌. ఇలాంటి పెద్ద చీర‌లు సాధార‌ణంగా దొర‌క‌వు వాటిని కొని అంద‌మైన బార్డర్స్‌తో డిజైన్ చేశార‌ట‌. జుంకాల‌ను కూడా స్పెష‌ల్‌గా ఉండేలా త‌యారు చేయించార‌ట‌. కృష్ణ‌మ్మ అందంగా క‌న‌ప‌డ‌టం వెనుక చాలా కష్టముంద‌ని డిజైన‌ర్స్ తెలియ‌జేశారు.