కోట రాణి కథతో...
Send us your feedback to audioarticles@vaarta.com
అందంలో క్లియో పాత్రకు తగ్గని రాణి కోట రాణి. ధైర్యసాహసాలలో ఆమె తెగువను ఝాన్సీ లక్ష్మీతో పోలుస్తారు. లోహరీ వంశంలో చివరి రాణి ఆమె కాశ్మీర్‌ని పరిపాలించిన చివరి హిందూ రాణి. ఆమె కథతో తెలుగు నిర్మాత మధు మంతెన సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించనున్నారు.
లోహరీ వంశంలో కోట రాణి 1339వరకు రాజ్యాలన్ని పరిపాలించారు. ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని ఇప్పటికీ ఆదర్శంగా తీసుకుంటారు. ఆమె గురించి మధు మంతెన మాట్లాడుతూ ``కొన్ని విషయాలు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. మన భారతీయులకు ఆమె గురించి కొంచెంగానీ, అసలు కానీ తెలియదు అని అనడం సబబేమో. ఆమెను ప్రపంచ సుందరి క్లియోపాత్రాతో పోల్చినా తప్పు కాదేమో. ఇప్పటికీ మనం చూస్తున్న ఎన్నో అద్భుతాలకు ఆమె పరోక్షంగా, ప్రత్యక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారు. అలాంటి వ్యక్తి కథను ఎలా మర్చిపోయామన్నదే ఆశ్చర్యం కలిగించే విషయం. నా దృష్టిలో కోట రాణి అద్భుతమైన స్త్రీ`` అని మధు మంతెన తెలిపారు.
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈఓ సిభాష్ సర్కార్ మాట్లాడుతూ ``కోటరాణి చాలా గొప్ప పరిపాలనా దక్షత గల స్త్రీ. భారత దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో పేరు లిఖించదగ్గ మహిళామణి. ఆమె పాత్రలో చాలా పార్శ్వాలున్నాయి. మన దేశ మహిళల ఘనత గురించి చెప్పాల్సి వస్తే, కోటరాణి ప్రతిభను వేనేళ్ల పొగడాల్సిందే. అయినా దురదృష్టవశాత్తూ మనలో చాలా మందికి ఆమె గురించి తెలియదు. కానీ మేం ఆమె గాథను భారీగా తెరపై ఆవిష్కరించాలనుకుంటున్నాం. మన వీరవనిత ధీరత్వాన్ని వేనోళ్ల పొగిడేలా చేయాలనుకుంటున్నాం`` అని అన్నారు.
ఈ బయోపిక్‌కి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. మధు సిభాషి కలిసి ప్రస్తుతం `83` సినిమా చేస్తున్నారు. దీనికన్నా ముందు వారు `సూపర్ 30` చేశారు. అందులో హృతిక్ రోషన్ గణిత మేధావిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వికాస్ బాహెల్ దర్శకత్వం వహించారు.
తాజాగా కాశ్మీరీ రాణికి సంబంధించిన పాత్రను ఎవరు చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీపిక పదుకొణేనే మళ్లీ సంప్రదిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఇంతకు ముందు రాజ్‌పుత్ రాణి పద్మావత్‌గా అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout