గోవా వెళ్తున్న నలుగురు అమ్మాయిల కథ!
Send us your feedback to audioarticles@vaarta.com
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై బాలు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రిధా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధీ ఇద్నాని, కోమలి ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇటీవల పూర్తయింది. ఫిబ్రవరి రెండో వారంలో కీలక సన్నివేశాలు, పాటల, పోరాట దృశ్యాల చిత్రీకరణకు చిత్రబృందం గోవా వెళ్లనుంది.
ఈ సందర్భంగా దర్శకుడు బాలు మాట్లాడుతూ... "మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. స్వతంత్ర్య భావాలున్న నలుగురి జీవితాల్లో ఏం జరిగిందనేది ఆసక్తికరం. జనవరిలో హైదరాబాద్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ నెల రెండో వారంలో గోవాలో మొదలు కానున్న సెకండ్ షెడ్యూల్ లో రెండు పాటలు, కీలక సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాం. నెలాఖరుకు గోవా షెడ్యూల్ పూర్తవుతుంది. మార్చిలో హైదరాబాదులో మూడో షెడ్యూల్ ప్లాన్ చేశాం. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానుగుణంగా వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి" అన్నారు.
త్రిధా చౌదరి, ధన్యా బాలకృష్ణ, సిద్ధీ ఇద్నాని, కోమలి ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: రఘుకుంచె, సినిమాటోగ్రఫీ: శేఖర్ గంగమోని, పాటలు: భాస్కర భట్ల, లక్ష్మీ భూపాల్, ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విక్కీ రొలర్ కొస్టర్, లైన్ ప్రొడ్యూసర్: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాతలు: రాధికా శ్రీనివాస్ వెత్షా, ఉమా కూచిపూడి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, రచన, దర్శకత్వం: బాలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com