చంద్రశేఖర్ ఏలేటి మనమంతా కథ ఇదే..
Thursday, June 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమి, కేరింత ఫేం విశ్వంత్ ప్రధాన పాత్రల్లో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మనమంతా. ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. విభిన్న కథాంశాలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి ఈసారి కూడా ఓ విభిన్న కథాంశంతోనే మనమంతా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బడికి వెళ్లే బాలిక, టీనేజ్ కుర్రాడు, మధ్య వయసున్న మరో ఇద్దరు..
ఈ నలుగురి జీవితాలు అనుకోకుండా ఒక చోట కలవడం, దాంతో అందరి జీవితాలూ అనుకోని మలుపులు తిరగడం అనే వినూత్న కాన్సెప్ట్‌తో మనమంతా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, మళయాల భాషల్లో రూపొందుతోన్న ఈ విభిన్న కథా చిత్రం మనమంతా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు ఈ మనమంతా చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments