చంద్రశేఖర్ ఏలేటి మనమంతా కథ ఇదే..

  • IndiaGlitz, [Thursday,June 02 2016]

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్, గౌత‌మి, కేరింత ఫేం విశ్వంత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం మ‌నమంతా. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. విభిన్న క‌థాంశాల‌ను తెర‌కెక్కించే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఈసారి కూడా ఓ విభిన్న క‌థాంశంతోనే మ‌న‌మంతా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బ‌డికి వెళ్లే బాలిక, టీనేజ్ కుర్రాడు, మధ్య వయసున్న మరో ఇద్దరు..
ఈ నలుగురి జీవితాలు అనుకోకుండా ఒక చోట కలవడం, దాంతో అందరి జీవితాలూ అనుకోని మలుపులు తిర‌గడం అనే వినూత్న కాన్సెప్ట్‌తో మ‌న‌మంతా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు, మళయాల భాషల్లో రూపొందుతోన్న ఈ విభిన్న క‌థా చిత్రం మ‌న‌మంతా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. వైవిధ్య‌మైన చిత్రాల‌ను ఆద‌రించే ప్రేక్ష‌కులు ఈ మ‌న‌మంతా చిత్రాన్ని కూడా ఆద‌రిస్తార‌ని ఆశిద్దాం.

More News

ముంబాయిలో నాగ అన్వేష్ పాటల రికార్డింగ్

నాగ అన్వేష్,హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కనున్న చిత్రం 'ఏంజిల్'.శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కనున్న

నాడు మాస్, జై చిరంజీవ - నేడు సర్ధార్, అ ఆ

మాస్,జై చిరంజీవ-సర్ధార్,అ ఆ...ఈ నాలుగు చిత్రాలకు ఉన్న లింకు ఏమిటి అని తెగ ఆలోచిస్తున్నారా..?

స‌మంత అ ఆ చూసిన చైత‌న్య‌..

నితిన్ - స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం అ ఆ. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కించారు. ఈరోజు అ ఆ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది.

జర్నలిస్ట్ గా సమంత

బెంగళూర్ డేస్, థెరి, బ్రహ్మోత్సవం, 24, అఆ సినిమాలతో ఈ ఏడాది సందడి చేసిన హీరోయిన్ సమంత ఓ డిఫరెంట్ రోల్ చేయడానికి రెడీ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన వార్తల్లో యూ టర్న్ అనే మూవీని సమంత నిర్మిస్తూ నటించనుందని వార్తలు వచ్చాయి.

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫ‌స్ట్ లుక్ కి సూప‌ర్బ్ రెస్పాన్స్ - చిత్ర‌యూనిట్

స్వామిరారా, కార్తికేయ‌, సూర్య vs సూర్య లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో వ‌రుస సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో టాలీవుడ్ ట్రేండ్ ని మార్చిన యంగ్ఎన‌ర్జిటిక్ హీరో నిఖిల్, 21F ఫేం హెబాప‌టేల్‌, త‌మిళం లో అట్ట‌క‌త్తి, ముందాసిప‌త్తి, ఎధిర్ నీచ‌ల్ ఫేం నందిత స్వేత  ల కాంబినేష‌న్ లో టైగ‌ర్ ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా మేఘ‌న ఆర్ట్స్ ని