‘నాని.. గ్యాంగ్ లీడర్’లో కీలక పాత్ర నానిది కాదట..
Send us your feedback to audioarticles@vaarta.com
నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం 'నాని'స్ గ్యాంగ్ లీడర్'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, ఫస్ట్ సాంగ్‌కి, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్‌కు రోజులు దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా నాని మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలతో పాటు అసలు సినిమాలో హైలైట్ ఏంటి..? కథ ఎలా ఉండబోతోంది..? అనే విషయాలను పంచుకున్నారు.
సినిమా టైటిల్ ఆలోచన గురించి!
‘డైరెక్టర్ విక్రమ్ గారు నేను కలిసి పనిచేయాలని చూస్తున్నాం. సరిగ్గా నేను జెర్సీ మూవీ చిత్రీకరణలో ఉన్నప్పుడు నాకు ఆయన కొన్ని కథలు వినిపించారు. వాటిలో నాకు ‘గ్యాంగ్ లీడర్’ కథ చాలా బాగా నచ్చింది. నేను రెఢీ అని చెప్పడంతో ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సినిమా షూటింగ్ ప్రారంభించేశారు.‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచన విక్రమ్ గారిదే. ఐతే ఈ టైటిల్‌పై కొన్ని వివాదాలు, భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి.. అందుకే కాస్త మార్చి ‘నాని గ్యాంగ్ లీడర్’ అని పెట్టడం జరిగింది. నా దృష్టిలో ఈ టైటిల్ ఈ కథకు చక్కగా సరిపోతుందని అనుకుంటున్నాను. మూవీ చూసిన తర్వాత మీకు కూడా అర్థం అవుతుంది’ అని నాని చెప్పుకొచ్చాడు.
ఆయనదే కీలక పాత్ర..!
విలన్ పాత్రకు హీరో కార్తికేయనే కాకుండా మొత్తం నలుగురు పేర్లు అనుకోవడం జరిగింది. అయితే మొదట కార్తికేయను విలన్‌గా నటించాలని సంప్రదించగా ఓకే అన్నారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి ఆ పాత్ర చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. ఈ సినిమాలో కార్తికేయ దే కీలకపాత్ర.. ఆయన పాత్ర అందరికి బాగా కనెక్ట్ అవుతుంది.. అందరూ ఆయన్ను మెచ్చుకుంటారు. ‘జెర్సీ’ కోసం నేను మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చింది.. కానీ ‘గ్యాంగ్ లీడర్’ విషయంలో మాత్రం అలా కాదు. విక్రమ్ వలన ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ చాలా సాఫీగా.. అంతకుమించి హ్యాపీగా సాగింది’ అని నేచురల్ స్టార్ చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout