Yentamma Song:ఏంటమ్మా సాంగ్‌లో గెస్ట్ అప్పీయరెన్స్.. చరణ్‌ మంకు పట్టు, సల్లూభాయ్ దిగిరాక తప్పలేదా..?

  • IndiaGlitz, [Thursday,April 06 2023]

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో వున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ అవార్డ్ రావడంతో పాటు తన భార్య ఉపాసన గర్భందాల్చడంతో జీవితంలో మరుపురాని క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు. అటు శంకర్‌తో మూవీని కూడా స్పీడుగా లాగించేస్తున్నాడు. ఇదిలావుండగా .. బాలీవుడ్‌ నుంచి కూడా చరణ్‌కు ఆఫర్లు వస్తున్నాయి. అయితే చెర్రీ ఆచితూచి స్పందిస్తున్నారు. బాలీవుడ్‌లో తొలి నుంచి మెగా ఫ్యామిలీకి మంచి పలుకుబడి వున్న సంగతి తెలిసిందే. దీనిని అవసరానికి అనుగుణంగా వాడుతున్నాడు చెర్రీ.

లుంగీ కట్టి మాస్ లుక్‌లో ఇరగదీసిన గ్లోబల్ స్టార్ :

తాజాగా సల్మాన్ ఖాన్‌ నటిస్తున్న ‘‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’’ చిత్రంలో చరణ్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. తెలుగు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ సైతం కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో సల్మాన్, వెంకటేష్‌లతో కలిసి చరణ్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ‘‘ఏంటమ్మా’’ అంటూ సాగే పాటలో లుంగీ కట్టి మాస్ లుక్‌లో ఇరగదీశాడు మన గ్లోబల్ స్టార్.

మంకుపట్టు పట్టిన చరణ్ :

కాగా.. ఈ పాటలో చరణ్‌కు ఛాన్స్ ఎలా వచ్చిందన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. దీనిని ఒకసారి చూస్తే.. చిరంజీవి నటించిన ఆచార్య కోసం ధర్మస్థలి సెట్ వేసిన సంగతి తెలిసిందే. ఇక్కడే ‘ఏంటమ్మా’ సాంగ్ చిత్రీకరణ జరిగింది. ఓ రోజు షూటింగ్ చూడటానికి వచ్చిన చరణ్‌కు .. సల్మాన్, వెంకీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనిపించిందట. ఇదే విషయాన్ని సల్మాన్‌కు చెప్పగా.. ఆయన తొలుత ఒప్పుకోలేదట. అయినా చెర్రీ వెనక్కి తగ్గకపోవడంతో సల్మాన్ ఒప్పుకోక తప్పలేదట. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ముగ్గురు సూపర్‌స్టార్స్ డ్యాన్స్ చేశారు. వీరికి తోడు పూజా హెగ్డే కూడా తన అందచందాలతో ఆకట్టుకుంది. ఏప్రిల్ 21న ‘‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’’ రిలీజ్ కానుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More News

Kiccha Sudeep:బీజేపీకి జై కొట్టిన కిచ్చా సుదీప్ .. వచ్చే ఎన్నికల్లో కమలానికి ప్రచారం, కర్ణాటకలో సమీకరణాలు మారుతాయా..?

భారతదేశంలో సినీ తారలకు రాజకీయాలకు విడదీయరాని అనుబంధం వుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు ఎందరో తారలు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి పాల్గొనగా..

Ram Charan Upasana:దుబాయ్‌లో ఉపాసనకు సీమంతం .. బీచ్‌లో భార్యతో గడిపిన చరణ్ , ఫోటోలు వైరల్

పెళ్లయిన దాదాపు 12 ఏళ్ల తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు ఇటీవల శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan:ముగిసిన పవన్ ఢిల్లీ పర్యటన .. అమిత్ షాను కలవకుండాను, పొత్తులపై సస్పెన్స్ కంటిన్యూ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల క్రితం రాజధానికి చేరుకున్న ఆయన..

Pushpa 2 : పుష్ప ఎక్కడ.. బన్నీ ఫ్యాన్స్‌కి బిగ్‌ సర్‌‌ప్రైజ్, పూనకాలు తెప్పిస్తోన్న గ్లింప్స్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘‘పుష్ప’’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్నీ కావు. ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్, ఫైట్స్‌ ప్రజలను విశేషంగా అలరించాయి

Dilraju : పొలిటికల్‌గా ఆఫర్లు వస్తున్నాయి.. కానీ : రాజకీయ రంగ ప్రవేశంపై దిల్‌రాజు క్లారిటీ

దిల్‌రాజు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. డిస్ట్రిబ్యూటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన బడా ప్రొడ్యూసర్‌గా ఎదిగారు.