`సైరా నరసింహారెడ్డి` అలా ట్రాక్ ఎక్కిందట
- IndiaGlitz, [Sunday,September 08 2019]
చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించిన హిస్టారికల్ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. నిజానికి చిరంజీవితో ఈ తరహా భారీ హిస్టారికల్ సినిమాను చేయాలని అటు సురేందర్ రెడ్డి.. ఇటు రామ్‌చరణ్ కానీ అనుకోలేదట. చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'ధృవ'. తర్వాత చిరంజీవి, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా చేద్దామని అనుకున్నాడట. ఆ సమయంలో చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి 'ఖైదీ నంబర్ 150' సినిమాను చేయాలనుకుంటున్నాడట. చిరంజీవిని కలిసి చర్చలు ఓ కమర్షియల్ చేయాలనుకుని చర్చలు జరిపేటప్పుడు.. చిరు మాత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను చేయాలనుకుని చేయలేకపోయామనే ప్రస్తావన తీసుకొచ్చేవారట. ఈలోపు 'ఖైదీ నంబర్ 150' విడుదలై చాలా పెద్ద హిట్ కావడంతో అందరిలో కాన్ఫిడెంట్ వచ్చింది. అప్పుడు రామ్‌చరణ్ నిర్మాణంలో 'సైరా నరసింహారెడ్డి' సినిమా చేయాలనుకున్నారు. రీసెర్చ్ కోసం సురేందర్ సమయం తీసుకున్నాడట. ట్రై చెయ్ కాకపోతే కమర్షియల్ సినిమానే చేద్దామని అన్నాడట. సురేందర్ రెడ్డి రీసెర్చ్ చేసి వివరాలను సేకరించాడట. అలా నరసింహారెడ్డి సినిమాట్రాక్ ఎక్కిందట.
సురేందర్ రెడ్డి అసలు బడ్జెట్ గురించి ఆలోచించలేదట. చిరంజీవిని ఎలా చూపించాలనే దానిపైనే ఫోకస్ పెట్టాడట. జార్జియాలో వార్ ఏపిసోడ్స్‌ను చిత్రీకరించారట. తమిళనాడులో హోగానికల్, కేరళలో, కర్ణాటకలో చిత్రీకరించారు. అలాగే హైదరాబాద్‌లో భారీ సెట్ వేసి చిత్రీకరించారు. 'సైరా నరసింహారెడ్డి' చిత్రం చిరంజీవి లైఫ్‌లో బెస్ట్ మూవీ కావాలని చరణ్ అన్ కాంప్రమైజ్డ్‌గా తెరకెక్కించాడట. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, నిహారిక, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రధారులుగా నటించారు. ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి. సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.