‘మహా సముద్రం’ టైటిల్ వెనుక కథ ఇదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్‌గా తొలి చిత్రం ‘ఆర్.ఎక్స్ 100’తో సూపర్‌హిట్ అందుకున్నాడు అజయ్ భూపతి. ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి తదుపరి సినిమా ‘మహా సముద్రం’ను ట్రాక్ ఎక్కించడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఈ మల్టీస్టారర్ కథను సిద్ధం చేసుకన్న తర్వాత అజయ్ భూపతి.. సినిమాను ఓకే చేయించుకోవడానికి చాలా ఇబ్బందులే పడ్డాడు. మాస్ మహారాజా రవితేజ సహా పలువురు హీరోలను కలిశాడు. అంతా ఓకే అవుతున్న తరుణంలో పలు కారణాలతో ప్రాజెక్ట్ ఆగుతూ వచ్చింది. ఏదైతేనేం చివరకు శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతోంది.
వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం కావడం.. సినిమా అంతా మహా అనే అమ్మాయి చుట్టూ తిరగడమూ వంటి కారణాలతో ఈ సినిమాకు ‘మహా సముద్రం’ అనే టైటిల్ పెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఒకరు అదితిరావు హైదరి కాగా.. అనుఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం ఇందులో మహా అనేది హీరోయినా? లేక మరింకేవరైనా అనేది తెలుసుకోవాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com