కృష్ణపట్నం కరోనా మందు.. అసలు కథ ఇదీ..
Send us your feedback to audioarticles@vaarta.com
‘కృష్ణపట్నం కరోనా మందు..’ కొవిడ్ రోగుల పాలిట దివ్వఔషధం! ఇప్పటి వరకూ ఎలాంటి రిమార్క్ లేదు. మందు వాడిన వారంతా కరోనా నుంచి కోలుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. వైద్యులు తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన కేసులను సైతం ఈ మందు బతికించింది. కరోనా రాని వారికి కూడా వైరస్ సోకుకుండా అడ్డుకునే బ్రహ్మాస్త్రం! కరోనా సెకండ్‌వేవ్ కుదిపేస్తున్న వేళ ప్రస్తుతం కృష్ణపట్నం కరోనా మందు గురించే చర్చ. ప్రాణాలపై ఆశను పెంచుతోంది. అయితే ఈ మందుకు ఏమేం వాడుతున్నారనే దానిపై కూడా పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇది ఎంతవరకూ నమ్మదగిందని కొందరు మేధావులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మందు శాస్త్రీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పంపిణీని నిలుపుదల చేసింది. వీరి అనుమానాలకు ఆయుష్ ల్యాబ్ చెక్ పెట్టింది. మరోవైపు దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కృష్ణపట్నం కరోనా మందుని పంపిణీ చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం
కృష్ణపట్నంలో కరోనా మందును అందిస్తున్న వ్యక్తి పేరు బొరిగి ఆనందయ్య. ఈ కుటుంబం వంశపారంపర్యంగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నారు. దీని కోసం మొదట్లో పదుల సంఖ్యలో జనం వచ్చేవారు. ఇప్పుడది రోజుకు వేలల్లో జనం వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆనందయ్య 70 వేల మందికి మందు అందించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఆనందయ్య ఎన్ని రకాల మందులు తయారు చేస్తారు? అసలు ఆ మందుల కోసం ఏమేమి వస్తువులు వాడుతారో చూద్దాం.
ఐదు రకాల మందులు తయారీ..
1 ఊపిరితిత్తుల కోసం: ఈ మందు పాజిటివ్ ఉన్న వారు, లేనివారు వాడవచ్చు. దీన్ని వాడితే ఊపిరితిత్తులు శుభ్రమై శక్తిపుంజుకుంటాయి. తెల్లజిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌దంగి (ఆడ, మగ) ఐదు వంతులు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చకర్పూరం, ఫిరంగి చెక్క, అన్నింటినీ కలిపి పొడిచేసి తేనెలో నాలుగు గంటలపాటు ఉడికించాలి. పాజిటివ్ రోగులకు దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు ఇవ్వాలి. కరోనా సోకని వారు ఒక్క రోజు వాడితే చాలు.
2.పాజిటివ్ రోగులకోసం: పుప్పింట ఆకు, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె మిక్సీలో వేసి పొడిచేయాలి. దాన్ని తేనెలో 4 గంటల పాటు ఉడికించాలి. దీన్ని కరోనా రోగులకు భోజనంతోపాటు ఒకసారి చొప్పున రెండు రోజులు ఇవ్వాలి.
3.పాజిటివ్ రోగులకోసం: నేల ఉసిరి, గుంటగరగరాకు, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె కలిపి పొడి చేసి 4 గంటల పాటు తేనెలో ఉడికించాలి. పాజిటివ్ రోగులకు పైన తెలిపిన రెండు మందులను ఇచ్చిన నాలుగు గంటల తరువాత ఒకసారి చొప్పున రెండు రోజులు ఇవ్వాలి.
4.పాజిటివ్ రోగులకోసం: పెద్దపల్లేరు కాయ, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె అన్నీ కలిపి పొడిచేసిన మిశ్రమాన్ని తేనెలో 4 గంటు ఉడికించాలి. రోజుకు ఒకసారి చొప్పున రెండు రోజులు వాడాలి.
5.పాజిటివ్ రోగులకోసం: ఒక కేజీ తేనె, 100 గ్రాముల తోక మిరియాలు, చారెడు ముళ్ల వంకాయ గుజ్జు. తయారీ విధానం. తేనె వేడి చేసి అందులో తోక మిరియాలు, ముళ్ల వంకాయ గుజ్జు వేయాలి. ఈ ద్రావణాన్ని ఆక్సిజన్ స్థాయినిబట్టి ఒక్కో కంటిలో ఒక్కో డ్రాప్ చొప్పున వేయాలి.
ప్రమాణాలకు లోబడే: ఆయుష్ ల్యాబ్
ఇక ఆనందయ్య కరోనా మందును పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ఆయుష్ ల్యాబ్‌కు పంపించింది. ఈ ల్యాబ్ నుంచి గురువారం రాత్రి 9 గంటలకు వచ్చిన రిపోర్టుల ప్రకారం ఈ మందులు హానికరం కావని తేలింది. అలాగే, ప్రమాణాలకు లోబడి కూడా ఉన్నాయని రిపోర్టులో స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంకొన్ని రిపోర్టులకు రెండు రోజులు పట్టవచ్చు. అప్పటివరకు ప్రభుత్వం ఈ మందుల పంపిణీకి అనుమతి ఇవ్వదు. అయితే, స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాత్రం శుక్రవారం నుంచి మందులు పంపిణీ చేస్తామని ప్రకటించడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments