Nara Lokesh:హింసతో హీరో అయిపోదామనేనా : నాడు తండ్రి, నేడు కొడుకు, భీమవరంలో కేడర్‌ను రెచ్చగొట్టిన లోకేష్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగుదేశం పార్టీ నేతల్లో నానాటికీ ఫస్ట్రేషన్ పెరిగిపోతోంది. తమ సభకు, సమావేశాలకు జనం రాకపోవడంతో ఏదో విధంగా హైలెట్ అవ్వాలనే ఉద్దేశంతో హింసకు తెరలేపుతున్నారు. కొద్దిరోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్‌ల విధ్వంసం పేరుతో సాగునీటి ప్రాజెక్ట్‌ల సందర్శనకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా పుంగనూరు, అంగళ్లులో విధ్వంసక ఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడే దగ్గరుండి కొట్టండి, తరమండి అంటూ శ్రేణులను రెచ్చగొట్టారు. కానీ నేరం మాత్రం వైసీపీ నేతలు, పోలీసులపై వేసే ప్రయత్నం చేశారు. కానీ దీని వెనుక వున్న కుట్రను చల్లా బాబు కారు డ్రైవర్ తన వాంగ్మూలంలో బట్టబయలు చేశారు.
పుంగనూరు, అంగళ్లులో విధ్వంసానికి కారణమైన చంద్రబాబు :
తండ్రి చంద్రబాబు బాటలోనే కొడుకు నారా లోకేష్ నడిచారు. నాడు అనుమతులు లేకుండా పుంగనూరులోకి వెళ్లి హీరోయిజం చూపించాలనుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు లోకేష్ సైతం గోదావరి జిల్లాల్లో హింసకు ఆజ్యం పోశారు. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కనుసన్నల్లో పక్కా స్కెచ్‌తో నానా హంగామా సృష్టించారు. లోకేష్ పాదయాత్ర సాగుతుండగా బీర్ సీసాలు, కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీలు చించేస్తూ కేకలు , అరుపులతో ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించారు. పుంగనూరు మాదిరే ఇక్కడా పోలీసులే బలి పశువులయ్యారు. టీడీపీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నంలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఉచ్చపోయిస్తాం, నరికేస్తాం అంటున్న లోకేష్ :
నాయకుడిగా తనను నిరూపించుకోవాలని అనుకుంటున్న లోకేష్ ఇంకా పరిణితి సాధించలేకపోతున్నారు. ఆయన ప్రతి అడుగు విమర్శల పాలవుతోంది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం, తొడలు కొట్టడం మినహా ప్రజలను ఆకట్టుకునేలా ఆయన ప్రసంగాలు లేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా ఉచ్చ పోయిస్తాం, నరికేస్తాం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మొన్న గన్నవరంలో ఎవరికైతే ఎక్కువ కేసులు వున్నాయో వారికి ప్రాధాన్యత ఇస్తానంటూ లోకేష్ అన్న మాటలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగకముందే భీమవరం ఘర్షణలు మరోసారి లోకేష్ సమర్ధతను ప్రశ్నిస్తున్నాయి.
ఇకపై లోకేష్‌ను ఉపేక్షించేది లేదంటున్న వైసీపీ :
కేవలం హింసను ప్రేరేపించి హీరో అవ్వాలని చూస్తున్న లోకేష్ తన భాషను, వైఖరిని మార్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఇక లోకేష్‌ను ఉపేక్షించేది లేదని అంటున్నారు. తమ సహనాన్ని తండ్రీ, కొడుకులు చేతగానితనంగా తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. భీమవరం విధ్వంసానికి సంబంధించి ఇప్పటికే అధికార పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనకు కారణమైన వారిని పోలీసులు పట్టుకునే పనిలో వున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout