లాభాలతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..

  • IndiaGlitz, [Thursday,April 25 2019]

స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. గత వారం రోజులుగా పెద్దగా లాభాలతో ప్రారంభం, ముగియని స్టాక్ మార్కెట్స్.. ఇవాళ లాభాలతో ప్రారంభమవ్వడంతో ముదుపరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రారంభంలో ఉన్న జోరు చివరి వరకు ఉంటే సంతోషమే. కాగా ప్రసుత్తం సెన్సెక్స్ 44 పాయింట్లతో ఎగసి 39099 వద్ద.. నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 11746 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. బ్యాంక్ నిఫ్టీ అండ్ ట్రెండ్ కొనసాగుతోంది. అన్ని రంగాలూ ప్రస్తుతం లాభాల్లోనే ఉన్నాయి. మరోవైపు.. జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎస్‌బ్యాంకు టాప్‌ విన్నర్‌గా ఉండటం విశేషం. కొన్ని బోయింగ్‌ విమానాలను టేక్ఓవర్‌ చేయనుందన్న వార్తలతోస్పైస్‌ జెట్‌ షేర్‌ లాభాల బాటలో నడుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఎస్ బ్యాంక్‌తో పాటు గ్రాసిం, అల్ట్రాటెక్ సిమెంట్‌, బీపీసీఎల్‌, ప‌వ‌ర్ గ్రిడ్ కంపెనీలు కూడా ముందున్నాయి.

ఇక నిఫ్టి టాప్ లూజ‌ర్స్ షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్‌జీసీ, మారుతీ, బ‌జాజ్ ఆటో, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. ముడి చ‌మురు ధ‌ర‌లు రాత్రి స్వల్పంగా క్షీణించ‌డం మార్కెట్ అనుకూల అంశ‌మే. మారుతి, ఇప్కా ల్యాబ్స్‌, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం ఫినాన్స్‌, బయోకాన్‌ ఇవాళ ఫలితాలను ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. దేశీయ కరెన్సీ రూపాయి బలహీనంగా కొనసాగుతుండగా.. డాలరు మారకంలో 69.81 స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. సో.. మొత్తానికి చూస్తే గత వారం రోజులతో పోలిస్తే స్టాక్ మార్కెట్ల పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. సో.. ఆరంభంలో ఉన్న పరిస్థితి చివరి వరకు ఉంటే పంట పండినట్లే మరి.!