ఆరంభంలో స్టాక్ మార్కెట్స్ హుషారు.. సాయంత్రానికి ఆవిరి!
Send us your feedback to audioarticles@vaarta.com
రెండ్రోజుల ముందు వరకు రేసు గుర్రాల్లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు.. గురువారం నాడు ఒడిదుడుకుల మధ్య ముగిశాయి. ఉదయం హుషారెత్తించే ఓపెనింగ్స్‌తో ప్రారంభమైనప్పటికీ సాయంత్రానికి అమ్మకాల ఒత్తిళ్లకు తలొగ్గడంతో లాభాల ఆశలన్నీ ఆవిరయ్యాయి. వివరాల్లోకెళితే.. విదేశీ పెట్టుబడులు, రిలయన్స్ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం భారీస్థాయిలో లావాదేవీలు జరిగినప్పటికీ.. సాయంత్రానికి అమ్మకాల ఒత్తిడి కారణంగా మార్కెట్ ఇండెక్స్‌లు నేలచూపులు చూడటం గమనార్హం. ఆరంభంలో 200కి పైగా పాయింట్లతో జోరు ప్రదర్శించిన సెన్సెక్స్ సాయంత్రానికి అదే ఊపు కనబర్చడంలో ప్లాప్ అయ్యింది.
ఇదిలా ఉంటే.. ఇంట్రాడేలో 39,487 వద్ద జీవనకాల గరిష్ఠ స్థాయిని తాకగా.. నిఫ్టీ కూడా 11,850 మార్క్‌ను దాటి రికార్డు స్థాయిలో ట్రేడ్ అయింది. అయితే ఆ సూచీల జోరు కాసేపు కూడా నిలవలేకపోవడంతో నష్టాల భారీన పడింది. అయితే ఆ దెబ్బతో ఏ దశలోనూ సూచీలు కోలుకోలేకపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి కల్లా సెన్సెక్స్ 135 పాయింట్లు దిగజారి 39,140 వద్ద.. నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 11,753 వద్ద స్థిరపడ్డాయి.
లాభపడినవి...
ఎన్‌ఎస్‌ఈలో రిలయన్స్, టాటామోటార్స్, విప్రో, భారత్ పెట్రోలియం షేర్లు లాభాల్లో ముగిశాయి.
నష్టాలుపాలైనవి..
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎస్ బ్యాంక్, హిందాల్కో, వేదాంతా లిమిటెడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, మౌలిక, లోహ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో సూచీలు కుదేలవ్వడం గమనార్హం. కాగా మొదట్లో ఉన్నంత దూకుడు చివరి వరకూ ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నిపుణులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments