నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్
- IndiaGlitz, [Monday,April 22 2019]
గత మూడ్రోజులుగా స్టాక్ మార్కెట్స్ నష్టాలతోనే ముగుస్తున్నాయి.!. ఈ నెల మొదట్లో రేసు గుర్రాల్లా పరుగులు తీసిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడు చతికిలపడ్డాయి. సోమవారం దేశీయ మార్కెట్స్ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ 290 పాయింట్ల నష్టంతో 38,849 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 11,657 వద్ద ట్రేడవుతోంది. అనూహ్యంగా ముడి చమురు ధరలు రెండు శాతంపైగా పెరగడంతో ఒక్కసారిగా మార్కెట్ ట్రెండ్ మారిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.
రూపాయి మారకం విలువ 69.89
ముడి చమురు ధరలు పెరగడంతో ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి బక్కచిక్కిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.89 వద్ద కొనసాగుతోంది. దీంతో ఒక్క ఐటీ షేర్లు మినహా మిగిలిన షేర్ల సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ సెషన్ కొనసాగే కొద్దీ అమ్మకాల ఒత్తిడి వస్తుందని స్టాక్ అనలిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.
టాప్ లూజర్స్‌లో బీపీసీఎల్, ఐఓసీ, ఎస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి. డీసీబీ బ్యాంక్, మహీంద్రా లైఫ్‌స్పేస్, కేపీఆర్ మిల్ లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్, టీసీఎస్, జిందాల్ స్టీల్, విప్రో, టెక్ మహీంద్రా, స్పైస్‌జెట్, రెడ్డీస్ ల్యాబ్, హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.