ఆ క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి: పవన్
Send us your feedback to audioarticles@vaarta.com
నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టు పెట్టారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు అజరామరం అనడంలో అతిశయోక్తి లేదన్నారు. నవరసాలను అలవోకగా పండించగల సత్యనారాయణ తెలుగు నేలపై జన్మించడం తెలుగువారి అదృష్టమన్నారు. సినిమా పరిశ్రమను హైదరాబాద్కు తీసుకు రావడంలో కైకాల కృషిని ఆయన కొనియాడారు. ఎందరో కళాకారులకు ఆయన ఆదర్శమని పవన్ పేర్కొన్నారు.
మద్రాసులో ఉన్నప్పటి నుంచే తమ కుటుంబంతో పాటు తనకు వ్యక్తిగతంగా కైకాలతో అనుబంధం ఉందని తెలిపారు. కలిసినప్పుడల్లా చాలా వాత్సల్యంతో కైకాల మాట్లాడుతారని పవన్ వెల్లడించారు. ముఖ్యంగా కైకాల మచిలీపట్నం నుంచి ఎంపీగా ఎన్నికైన సందర్భంగా ఆయనను కలిసిన క్షణాలను తనకు ఇప్పటికీ గుర్తొస్తుంటాయన్నారు. నటనలో అంత ఎత్తు ఎదిగిన కైకాలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి గుర్తింపు లభించకపోవడం పట్ల పవన్ బాధను వ్యక్తం చేశారు. కైకాలకు పద్మశ్రీ పురస్కారం అందించేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పవన్ కోరారు. కైకాల సంపూర్ణ, ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నానని పవన్ పేనవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టు పెట్టారు.ర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments