ముగ్గురిలో 'బాహుబలి' ఎవరికి దొరుకుతుంది?
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో విడుదలైన కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి`. రానా విలనిజంతో పాటు రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, అనుష్క, తమన్నాల నటన సినిమా పెద్ద ఎసెట్ అయింది. ప్రేక్షకులు, అభిమానులే కాకుండా విమర్శకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 160 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది.
సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు కావడం, సినిమా కూడా అదే రేంజ్ లో విజువల్ వండర్ గా ఉండటంతో సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమా శాటిలైట్ హక్కుల విషయంలో మంచి పోటీ నెలకొని ఉంది. శాటిలైట్ హక్కుల దక్కించుకోవాలని ప్రముఖ టీవీ చానెళ్లు పోటీ పడుతున్నాయి. మా టీవీ, జీటీవీ, ఈ టీవీ వారు ఈ వరుసలో ముందంజలో ఉన్నారట.
ఈ హక్కులు సాయికొర్రపాటి చేతిలో ఉన్నాయని, ఆయన ఎటువైపు మొగ్గుతారోనని అందరూ ఆశగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ మొత్తాన్ని కూడా చెల్లించడానికి సదరు చానెల్స్ రెడీ అయిపోయారని ఫిలిం వర్గాల టాక్. మరి ఈ ముగ్గురిలో బాహుబలి ఎవరికి దొరుకుతుందో చూడాల్సిందే..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com