కీలక నిర్ణయం: స్టీఫెన్ రవీంద్ర చేతికి ‘డేటా చోరీ’ కేసు
Send us your feedback to audioarticles@vaarta.com
‘డేటా చోరీ’ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువుర్ని విచారించిన సైబరాబాద్ పోలీసులు.. ‘ఐటీ గ్రిడ్’ డైరెక్టర్ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేల్చేయాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు అప్పగించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి రెండు కమిషనరేట్ల పరిధిలో జరిగిన దర్యాప్తు మొత్తం సిట్‌కు బదిలీ చేయడం జరిగింది.
ఈ సిట్‌కు ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహించనున్నారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. కాగా, డీజీపీ కార్యాలయంలోనే సిట్‌కు ప్రత్యేక ఛాంబర్ కేటాయించడం జరిగింది.
అసలు ఎవరీ స్టీఫెన్ రవీంద్ర..?
స్టీఫెన్ రవీంద్ర.. ఈయన మొండితనానికి, ముక్కుసూటి తనానికి, నిజాయితీకి మారుపేరైన అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో మంచి పేరుంది. ఎక్కడ.. ఏ ప్లేస్‌లో పోస్టింగ్ ఇచ్చినా సరే సమర్థవంతంగా పనిచేయడం ఆయన స్టైల్... ఆయనో ట్రెండ్ సెట్టర్ కూడా. తెలంగాణ ఉద్యమ సమయంలో స్టీఫెన్ పేరు ఓ రేంజ్లో వినపడింది. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దౌర్జన్యాలకు దిగి తెలంగాణవాదుల నుంచి "కర్కోటకుడు" అని అప్పట్లో అందరూ పిలుచుకున్నారు. తాజాగా ఈ డేటా చోరీ వ్యవహారం తేల్చాలని టి సర్కార్ స్టీఫెన్ అప్పగించడం జరిగింది. అయితే ఈ కేసులో టి సర్కార్‌కు నోటీసులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంలో ఏ మాత్రం పురోగతి ఉంటుంది..? అసలు దోషులెవరు..? ఈ మొత్తం వ్యవహారానికి కర్త కర్మ క్రియ ఎవరు..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments