కీలక నిర్ణయం: స్టీఫెన్ రవీంద్ర చేతికి ‘డేటా చోరీ’ కేసు

  • IndiaGlitz, [Wednesday,March 06 2019]

‘డేటా చోరీ’ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువుర్ని విచారించిన సైబరాబాద్ పోలీసులు.. ‘ఐటీ గ్రిడ్’ డైరెక్టర్‌ లుక్ అవుట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేల్చేయాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు అప్పగించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి రెండు కమిషనరేట్ల పరిధిలో జరిగిన దర్యాప్తు మొత్తం సిట్‌కు బదిలీ చేయడం జరిగింది.

ఈ సిట్‌‌కు ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వం వహించనున్నారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. కాగా, డీజీపీ కార్యాలయంలోనే సిట్‌కు ప్రత్యేక ఛాంబర్ కేటాయించడం జరిగింది.

అసలు ఎవరీ స్టీఫెన్ రవీంద్ర..?

స్టీఫెన్ రవీంద్ర.. ఈయన మొండితనానికి, ముక్కుసూటి తనానికి, నిజాయితీకి మారుపేరైన అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో మంచి పేరుంది. ఎక్కడ.. ఏ ప్లేస్‌లో పోస్టింగ్ ఇచ్చినా సరే సమర్థవంతంగా పనిచేయడం ఆయన స్టైల్... ఆయనో ట్రెండ్ సెట్టర్ కూడా. తెలంగాణ ఉద్యమ సమయంలో స్టీఫెన్ పేరు ఓ రేంజ్‌లో వినపడింది. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై దౌర్జన్యాలకు దిగి తెలంగాణవాదుల నుంచి కర్కోటకుడు అని అప్పట్లో అందరూ పిలుచుకున్నారు. తాజాగా ఈ డేటా చోరీ వ్యవహారం తేల్చాలని టి సర్కార్ స్టీఫెన్‌ అప్పగించడం జరిగింది. అయితే ఈ కేసులో టి సర్కార్‌కు నోటీసులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంలో ఏ మాత్రం పురోగతి ఉంటుంది..? అసలు దోషులెవరు..? ఈ మొత్తం వ్యవహారానికి కర్త కర్మ క్రియ ఎవరు..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

'సర్వం తాళ మయం' మార్చ్ 8 విడుదల

శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ రాజీవ్ మీనన్ రూపొందించిన 'సర్వం తాళ మయం' చిత్రాన్ని

స‌మ్మ‌ర్‌లో భ‌య‌పెట్ట‌నున్న లారెన్స్‌

రాఘ‌వ లారెన్స్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ 'కాంచ‌న' సిరీస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు పార్టులు విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించాయి.

మహిళా దినొత్సవం సందర్బంగా  క‌థ‌నం టీజర్ విడుదల

ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. రాజేష్‌నాదెండ్ల

'డేటా చోరీ' కేసులో కీలక వ్యక్తి.. ఆయన దొరికితే..!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘డేటా చోరీ’ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో తెలియని పరిస్థితి.

కోల్‌క‌త్తాకు 'RRR'

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'RRR'.