14 నుంచి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత

కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు గాను యావత్ దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే. ఆ లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. అయితే ప్రస్తుతం ఇంకా ఇండియా కరోనా మహమ్మారి మరింత పడగలిప్పడంతో అసలు లాక్‌డౌన్ ఎత్తేస్తారా..? లేకుంటే కొనసాగిస్తారా..? ఒకవేళ కొనసాగిస్తే ఎప్పటి వరకూ..? అనేదానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే.. తాజాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగుచూశాయి.

రాష్ట్రాల వారిగా కోవిడ్-19 పరిస్థితి ఎలా ఉంది..? ఆ వైరస్‌ను ఎదుర్కోవడానికి ఏమేం చర్యలు తీసుకున్నారు..? ఇంకా ఏమేం చేయాలి..? అనేదానిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే.. ఏప్రిల్ 14 నుంచి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారని తెలుస్తోంది. ఒకేసారి జనం రోడ్డుమీదకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంలకు పీఎం సూచించారు. లాక్ డౌన్ తర్వాత ఎదురయ్యే పరిస్థితులను నిశితంగా ప్రధాని చర్చించారు. అంతేకాదు.. లాక్ డౌన్ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించడం జరిగింది. దశల వారిగా ఎలా వర్కవుట్ అవుతుందో..? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More News

విజయ్..‘కొండంత’ సాయానికి లేటయ్యిందేం!?

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ఎక్కడ విపత్తులు వచ్చినా ముందుగా స్పందించి తన వంతుగా విరాళం ప్రకటించి టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రియల్ హీరో అనిపించుకుంటూ ఉంటాడు.

వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి వేతనాలు, ఇన్సెంటివ్స్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పోరులో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి ఈ నెల (మార్చి) పూర్తి వేతనం చెల్లించాలని

ఇండియాలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీలో ఎక్కువే!

యావత్ దేశవ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య గంట గంటకూ పెరిగిపోతోంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి ఇండియా కోలుకుంటోందనుకున్న టైమ్‌కు ఢిల్లీలోని నిజాముద్దీన్ ఘటనతో ఒక్కసారిగా

నిర్మాత ట్వీట్‌కు కెటీఆర్ రిప్లై

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశం స్తంభిస్తే.. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తివారు అట్టుకుడికిపోతున్నారు. ఢిల్లీ వంటి కేంద్ర రాజ‌ధానిలో కార్మికుల ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది.

మెగాభిమానుల‌కు ఆ విష‌యంలో నిరాశ త‌ప్ప‌దా?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.