14 నుంచి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు గాను యావత్ దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించిన విషయం విదితమే. ఆ లాక్డౌన్ ఈ నెల 14తో ముగియనుంది. అయితే ప్రస్తుతం ఇంకా ఇండియా కరోనా మహమ్మారి మరింత పడగలిప్పడంతో అసలు లాక్డౌన్ ఎత్తేస్తారా..? లేకుంటే కొనసాగిస్తారా..? ఒకవేళ కొనసాగిస్తే ఎప్పటి వరకూ..? అనేదానిపై ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే.. తాజాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగుచూశాయి.
రాష్ట్రాల వారిగా కోవిడ్-19 పరిస్థితి ఎలా ఉంది..? ఆ వైరస్ను ఎదుర్కోవడానికి ఏమేం చర్యలు తీసుకున్నారు..? ఇంకా ఏమేం చేయాలి..? అనేదానిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్డౌన్ విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే.. ఏప్రిల్ 14 నుంచి దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారని తెలుస్తోంది. ఒకేసారి జనం రోడ్డుమీదకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంలకు పీఎం సూచించారు. లాక్ డౌన్ తర్వాత ఎదురయ్యే పరిస్థితులను నిశితంగా ప్రధాని చర్చించారు. అంతేకాదు.. లాక్ డౌన్ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించడం జరిగింది. దశల వారిగా ఎలా వర్కవుట్ అవుతుందో..? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుందో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout