Superstar Krishna:కృష్ణకు ఘననివాళి.. బుర్రిపాలెంలో సూపర్‌స్టార్ విగ్రహావిష్కరణ, ఎప్పుడంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ కృష్ణ కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ గతేడాది నవంబర్ 15న తిరిగిరాని లోకాలకు తరలివెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులు అద్దడమే కాకుండా, డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోగా, ఆంధ్రా జేమ్స్‌బాండ్‌గా జననీరాజనాలు అందుకున్నారు కృష్ణ. ఆయన మరణించారంటే ఇప్పటికీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. అయితే కృష్ణ జ్ఞాపకార్ధం ఆయన అభిమానులు సూపర్‌స్టార్ విగ్రహాలను పెడుతున్నారు. తాజాగా కృష్ణ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఆయన కుటుంబ సభ్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని కృష్ణ సోదరుడు, సినీ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఆగస్ట్ 5న బుర్రిపాలెంలో కృష్ణ విగ్రహావిష్కరణ :
అభిమానులు, స్వగ్రామంలోని ప్రజల కోరిక మేరకు ఆగస్ట్ 5న (శనివారం) ఉదయం 10 గంటలకు బుర్రిపాలెంలో కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని కృష్ణకు నివాళులర్పించాలని ఆయన కోరారు. అలాగే బుర్రిపాలెంలో ఆవిష్కరించనున్న కృష్ణ విగ్రహం ఫోటోను కూడా ఆదిశేషగిరిరావు పంచుకున్నారు. అగ్నిపర్వతం చిత్రంలోని జమదగ్ని గెటప్‌లో , చేతిలో స్టిక్ పట్టుకున్న కృష్ణ విగ్రహం రాజసం ఉట్టిపడుతోంది.
కృష్ణ ప్రస్థానం:
1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి వుండగా.. ఏలూరులో చదువుతుండగా అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానాన్ని చూసి తాను కూడా నటుడిని కావాలని కృష్ణకు బలంగా నాటుకుపోయింది. మద్రాసులో తెలిసిన వారి ద్వారా అవకాశాల కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో 1964లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ‘‘తేనే మనసులు’’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇక వెను దిరిగి చూసుకోలేదు. ఐదు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్లో 340కి పైగా సినిమాల్లో నటించారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. పద్మాలయా స్టూడియోస్ పేరుతో చిత్ర నిర్మాణంతో పాటు 16 సినిమాలకు దర్శకత్వం వహించారు.
టాలీవుడ్‌కు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన నటశేఖరుడు :
నేడు తెలుగు సినిమా ఈ స్థాయిలో వుందంటే అందుకు కృష్ణ కూడా కీలకపాత్ర పోషించారు. కొత్త సాంకేతికతలు, జానర్లను ఆయన పరిచయం చేశారు. తొలి తెలుగు జేమ్స్ బాండ్ (గూఢచారి 116), తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు), తొలి ఫుల్ స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు), తొలి 70 ఎంఎం (సింహాసనం), తొలి డీటీఎస్ (తెలుగు వీర లేవరా) వంటి చిత్రాల్లో కృష్ణ నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout