ఇకపై ఉదయం 10 గంటల నుంచి సరిహద్దులు బంద్: డీజీపీ మహేందర్‌రెడ్డి

  • IndiaGlitz, [Saturday,May 22 2021]

తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌లను మ‌రింత క‌ఠిన‌త‌రం చేశారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రాష్ట్ర స‌రిహ‌ద్దులు మూసివేస్తామని డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్ అమలుపై డీజీపీ మహేందర్‌రెడ్డి నేడు హైదరాబాద్ నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా కూకట్‌పల్లి, జేఎన్టీయూలో తనిఖీలు నిర్వహించారు. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అకారణంగా రోడ్లపైకి వచ్చేవారి వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. కూకట్‌పల్లి చెన్నై షాపింగ్ మాల్ దగ్గర సీపీ సజ్జనార్ వాహన తనిఖీలు చేపట్టారు. అనవసరంగా బయటకు వస్తున్నా వారిపై నేడు పోలీసులు లాఠీ ఝుళిపించారు.

అరకిలో టమాటాకి.. రోడ్ల మీదకు వస్తే ఎలా?

హైదరాబాద్‌లో భారీగా వాహనాలను పోలీసులు నేడు సీజ్ చేశారు. రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. పబ్లిక్ సిల్లీ రీజన్స్ చెప్తున్నారని జాయింట్ సీపీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. అరకిలో టమాటాకి.. రోడ్ల మీదకు వస్తే ఎలా? అని ప్రశ్నించారు. పబ్లిక్‌కి లాక్‌డౌన్‌పై భాధ్యత లేకుండా పోయిందన్నారు. కొవిడ్ కంట్రోల్‌పై ఏమాత్రం అవగాహన లేదన్నారు. ఖాళీ సమయాల్లో రోడ్లపైకి రావడం ఫ్యాషన్ అయిపోయిందంటూ జాయింట్ సీపీ విశ్వప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైట్‌ వేర్స్ వేసుకొని ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నారని పబ్లిక్‌పై మండిపడ్డారు. మినహాయింపు క్యాటగిరి సైతం పని లేకున్నా రోడ్ల పైకి వస్తున్నారని జాయింట్ సీపీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌లు..

కాగా.. నేడు పోలీసులు ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను సైతం అడ్డుకున్నారు. దీంతో ప్యాట్నీ చౌరస్తా దగ్గర స్విగ్గీ, జొమాటో బాయ్స్ ఆందోళన నిర్వహించారు. ఆన్‌లైన్ డెలివరీ బంద్‌పై సంస్థల నుంచి సమాచారం లేదని డెలివరీ బాయ్స్ వాపోతున్నారు. కాగా.. నేడు నగరంలో విపరీతంగా ట్రాఫిక్ జామ్‌లు జరిగాయి. బేగంపేట్-సికింద్రాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌లో రెండు అంబులెన్స్‌లు చిక్కుకుపోయాయి. పోలీసులు వాహనాలను క్లియర్ చేసి అంబులెన్స్‌లను పంపించారు. పాస్‌లు ఉన్నవారికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు.

More News

డీఎల్ఎఫ్ ముడుపుల కేసులో లాలూకు సీబీఐ క్లీన్‌చిట్ ?

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్‌చిట్ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

ముంచుకొస్తున్న ‘యాస్’ తుపాను.. భారత నావికాదళం అప్రమత్తం

ఒకవైపు కరోనా మహమ్మారి.. మరోవైపు తుపానులు భారత్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమతీరాన్ని వణికించిన ‘తౌక్టే’ తుపాను కాస్త బలహీన పడిందని ఆనందిస్తున్న తరుణంలో విశాఖ

ఆనందయ్య మందుపై ఆయుష్ పాజిటివ్ రిపోర్ట్..

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్‌ కమిషనర్‌ రాములు ఆధ్వర్యంలో అధ్యయనం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

RRR: ట్రేడ్ దద్దరిల్లే రికార్డ్.. రూ. 325 కోట్లంటే మాటలా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వస్తున్న

బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువట..

ప్రస్తుతం కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కూడా దేశాన్ని వణికిస్తోంది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ప్రస్తుతం ఈ బ్లాక్‌ఫంగస్ సోకుతోంది. దీని కారణంగా రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు,