ఎక్స్‌క్లూజివ్‌...డైరెక్ట‌ర్‌కి డ‌బ్బులివ్వ‌ని స్టార్ నిర్మాత‌

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

సినిమా రంగంలో పైకి క‌న‌ప‌డే ఆప్యాయ‌త‌లు, అనురాగాలు వేరు.. కానీ లోపల‌ జ‌రిగే విష‌యాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఓ ద‌ర్శ‌కుడికి స్వీయానుభ‌వంలోకి వ‌చ్చింది. ఇండ‌స్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఈ ద‌ర్శ‌కుడుకి ఇలాంటి విష‌యాలు తెలియ‌వా? అంటే తెలియ‌కుండా ఏం ఉండ‌వు? కానీ అనుభ‌వానికి వ‌స్తే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అస‌లు వివ‌రాల్లోకెళ్తే.. స‌ద‌రు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొన్నేళ్లు ఆ హీరో ఫ్యామిలీతో మంచి ట‌చ్‌లో ఉన్నాడు. ఆ హీరోతో ఓ స‌క్సెస్‌ఫుల్ సినిమాను తెర‌కెక్కించాడు. ఆయ‌న టేకింగ్ న‌చ్చ‌డంతో ఆ హీరో నిర్మాత‌గా మారి తండ్రి, ఓ సీనియ‌ర్ అగ్ర హీరో ఓ హిస్టారిక‌ల్ మూవీని డైరెక్ట్ చేసే అవ‌కాశం క‌ల్పించాడు. ప్రారంభం నుండే భారీ బ‌డ్జెట్‌తో సినిమాను తెర‌కెక్కించాల‌నుకున్నారు. అనుకున్న‌ట్లుగానే భారీ రేంజ్‌లో సినిమాను తెర‌కెక్కించారు. రెండున్న‌రేళ్ల పాటు ఈ సినిమా కోసం ఆ ద‌ర్శ‌కుడు, ఎంటైర్ యూనిట్ సాగింది.

బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ‌గానే అయ్యింది. ప్యాన్ ఇండియా ఆర్టిస్టులంద‌రూ ఈ సినిమాలో న‌టించారు. సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్యాన్ ఇండియా మూవీగా సినిమా విడుద‌లైంది. సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద స‌క్సెస్ కాలేదు కానీ.. స‌ద‌రు సీనియ‌ర్ హీరో న‌ట‌న‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. ఆ ద‌ర్శ‌కుడి టేకింగ్ బావుంద‌ని అంద‌రూ అప్రిషియేట్ చేశారు. అంతా బాగానే ఉంది. కానీ సినిమా విడుద‌లై, థియేట‌ర్స్ నుండి వెళ్లి కూడా పోయింది. కానీ స‌ద‌రు ద‌ర్శ‌కుడుకి మాత్రం నిర్మాత‌గా మారిన స‌ద‌రు స్టార్ హీరో ఫుల్ రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ట‌. దీంతో ఆ ద‌ర్శ‌కుడుకి ఏం చేయాలో, ఎవ‌రికీ చెప్పుకోవాలో తెలియ‌డం లేద‌ట‌. మ‌రిప్పుడు ప‌రిస్థితులు ఎలా మారుతాయో చూడాలి.