Dilraju : విమర్శలను పట్టించుకోను .. శుక్రవారం రోజు మాత్రమే బాధపడతా : దిల్‌రాజు హాట్ కామెంట్స్
Send us your feedback to audioarticles@vaarta.com
దిల్‌రాజు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. డిస్ట్రిబ్యూటర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన బడా ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. ప్రస్తుతం టాలీవుడ్‌ని కనుసైగతో శాసించగల నలుగురిలో దిల్‌రాజు కూడా ఒకరు. ఈ నేపథ్యంలో తన 20 ఏళ్ల కెరీర్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని.. మొదట్లో విమర్శలు పట్టించుకునేవాడిని కానని, కానీ రాను రాను కొందరు వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని దిల్‌రాజు ఆరోపించారు. ఏ విషయంలోనైనా తన తప్పుంటే తప్పుకుండా బహిరంగ క్షమాపణ చెబుతానని ఈ స్టార్ ప్రొడ్యూసర్ తెలిపారు.
ఎంత సక్సెస్ అయితే అంతమంది శత్రువులు :
జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగితే అంతమంది శత్రువులు వుంటారని దిల్‌రాజు అన్నారు. ఒక మనిషిగా తన వ్యక్తిత్వానికి మచ్చ రాకుండా చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి సక్సెస్ ఎలా కొట్టాలనే దానిపైనా దృష్టి పెడతానని దిల్‌రాజు చెప్పారు. ఒక్క శుక్రవారం రోజు మాత్రమే ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తానని, కానీ నెక్ట్స్ ఫ్రైడే కోసం ఫుల్‌గా ప్రిపేర్ అవుతానని ఆయన స్పష్టం చేశారు. తనకు ఏ సోషల్ మీడియాలోనూ ఖాతాలు లేవని.. సామాజిక మాధ్యమాల్లో ఉండటం తనకు ఇష్టం లేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి పట్టించుకోనని దిల్‌రాజు తెలిపారు. మంచి కోసం సలహాలిస్తుంటే శాసిస్తున్నానని అంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇండస్ట్రీలోనే నన్ను విమర్శిస్తే తట్టుకోలేను :
ఇకపోతే.. రాజకీయ రంగ ప్రవేశంపై ఇటీవల దిల్‌రాజు స్పందించారు. రాజకీయాల్లోకి వెళ్లే అంశంపై తనకే స్పష్టత లేదన్నారు. చిత్ర పరిశ్రమలోనే తనపై ఎవరైనా కామెంట్స్ చేస్తేనే తాను తట్టుకోలేనని.. రాజకీయాల్లో తన వల్ల కాదని దిల్‌రాజు పేర్కొన్నారు. అయితే తనకు పొలిటికల్‌గా ఆఫర్లు చాలా వున్నాయన్నారు. అటు గ్రామాల్లో బలగం చిత్ర ప్రదర్శనలపై దిల్‌రాజు స్పందించారు. చిత్ర ప్రదర్శనలను తాము అడ్డుకోవడం లేదని.. సినిమా ఏ రకంగా చూసినా తమకు ఆనందమేనని, ఇలాంటి ప్రదర్శనల వల్ల ఓటీటీ సంస్థతో వచ్చే ఇబ్బందులను తామే పరిష్కరించుకుంటామని దిల్‌రాజు పేర్కొన్నారు. గ్రామాల్లో బలగం చూడాలనుకునేవారికి తామే దగ్గరుండి ఏర్పాట్లు చేస్తామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments