సిక్స్త్ సెన్స్... నాలుగో సీజన్ షురూ !!
Send us your feedback to audioarticles@vaarta.com
ఎంటర్ టైన్మెంట్, ఎక్సయిట్మెంట్ కలిసిన "సిక్స్త్ సెన్స్" సరికొత్తగా నాలుగో సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. గత మూడు సీజన్లుగా విభిన్నమైన అంశాల కలయికగా వచ్చిన ఈ షో ఇప్పుడు మరింత విలక్షణంగా ముస్తాబైంది.
మెస్మరైజ్ చేసే కొత్త లుక్.. షో లో వినోదాన్ని పండించే కంటెస్టెంట్స్... షో నిర్వహణలో ఓంకార్ ఇచ్చే కిక్ .. సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. బంచులకొద్దీ పంచులు వేసే ఆది, గ్లామరస్ స్టార్ యాంకర్ అనసూయ.. ఇంకా బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సిక్స్త్ సెన్స్ సీజన్ 4 కి వచ్చిన ఆ నలుగురు కంటెస్టెంట్స్ సోహెల్, మహబూబ్, అరియనా, హారిక.. మొదటి వారం చేసిన సందడి; స్టార్ ప్రెజెంటర్ ఓంకార్ కొత్త స్టైల్ - వినోదాన్ని కొత్తగా నిర్వచించబోతోంది. రానున్న ఎపిసోడ్స్ లో ఊహించని కంటెస్టెంట్స్ ఎందరో ఈ వేదిక పైన హంగామా చేయబోతున్నారు.
సిక్స్త్ సెన్స్ ని మూడు సీజన్లను విజయవంతంగా ఇంటరెస్టింగ్ గా తనదైన శైలిలో నిర్వహిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఓంకార్ ఈ నాలుగో సీజన్లో ఓ కొత్త పంధాలో షోని ఓ కంప్లీట్ ప్యాకేజిలా అందిస్తున్నారు. ఇంతకు ముందు సీజన్స్ లో వున్న ఫార్ములాని కొనసాగిస్తూనే కొత్త రౌండ్స్ ని కూడా పరిచయం చేయబోతున్నారు.
పార్టిసిపెంట్స్ భావోద్వేగాలను తన ఆటకు అనుగుణంగా మార్చి, ఏం జరుగుతోందో తెలియని స్థితికి తీసుకెళ్లి మళ్ళీ ఓ నిర్ణయానికి వచ్చేలా చేయడం గత సీజన్స్ లో చూసాం. ఈ నాలుగో సీజన్లో ఆట స్థాయి నెక్స్ట్ లెవెల్ లో చూడబోతున్నారు ప్రేక్షకులు.
ఈ వారాంతం లో (జూన్ 12,13) మొదలుకాబోతున్న సిక్స్త్ సెన్స్ సీజన్ 4 ప్రతి శనివారం, ఆదివారం ఆటలో కొత్త కొత్త మలుపులు, ఆటని నడిపించడంలో కొత్త కొత్త పద్ధతులను ప్రేక్షకులు చూడబోతున్నారు.
సిక్స్త్ సెన్స్... నాలుగో సీజన్ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Content Produced by Indian Clicks, LLC
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments